రాష్ట్రీయం

పత్తి రైతుకు బిటి దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తరతరాలుగా పత్తిని నమ్ముకుని జీవిస్తున్న రైతులు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దేశీయ పత్తి రకాలు అనేక తెగుళ్లకు గురవుతుండటంతో వీటి స్థానంలో రోగాలు సోకవని ప్రచారం పొందిన బిటి కాటన్ రకాలను రైతులు వేస్తున్నారు. తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా పత్తి విస్తీర్ణంలో ఇప్పటికే బిటి రకాలు 95 శాతం విస్తరించాయి. జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్న బిటి-1, బిటి-2 పత్తి రకాలు అనుకున్న ఫలితాలను సాధించకపోవడంతో రైతులు సరికొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు. బిటి-1 (బోల్‌గార్డ్-1), బిటి-2 (బోల్‌గార్డ్-2) రకాలను అమెరికాకు చెందిన ‘మోన్‌శాంటో’ కంపెనీ భారత్‌లో ప్రవేశపెట్టింది. 2005-06 నుండి 2010 వరకు బిటి-1 రకం మాత్రమే రాజ్యమేలింది. ఆ తర్వాత బిటి-2 రకాన్ని మోన్‌శాంటో విడుదల చేయడంతో రైతులంతా ఇదే రకాన్ని ప్రస్తుతం వేస్తున్నారు. మోన్‌శాంటో వద్ద సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనుక్కున్న దాదాపు 49 దేశీయ విత్తనోత్పత్తి కంపెనీలు వేర్వేరు పేర్లతో బిటి-1, బిటి-2 రకాల పత్తి విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నాయి. తెలంగాణ, ఏపీ తదితర రాష్ట్రాల్లో 2015 సీజన్‌లో బిటి-2 కాటన్ పంటపై కొత్త రకం తెగులు (పింక్ బోల్ వార్మ్) సోకడంతో పత్తిపంటకు తీవ్రమైన నష్టం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బిటి పత్తిపంట దెబ్బతినడంతో రైతులు సుమారు 5 వేల కోట్లకు పైగా నష్టపోయారు. పింక్ బోల్ వార్మ్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల రైతులే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా రైతులు నష్టపోయారు. పత్తిపంటకు బోల్‌వార్మ్ ఏ రూపంలో సోకి నష్టం జరిగినా సంబంధిత కంపెనీలతో పాటు బిటి-2 సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన మోన్‌శాంటో బాధ్యత వహించాలి. అయితే ఇప్పడు దేశీయ కంపెనీలు కానీ, మోన్‌శాంటో కాని బాధ్యత స్వీకరించకపోగా, పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. కంపెనీలే నష్టపరిహారం ఇవ్వాలని మోన్‌శాంటో అంటుండగా, మోన్‌శాంటోనే నష్టపరిహారం చెల్లించాలని కంపెనీలు అంటున్నాయి. ఇద్దరి మధ్య రైతులు లబోదిబోమంటున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ఏ రకం వేయాలి?
పత్తిపంటకు ప్రధాన శత్రువు కాయతొలిచే పురుగే (బోల్‌వార్మ్). బోల్‌వార్మ్‌ను తట్టుకునే శక్తి బిటి-2 రకానికి ఉంటుందని మోన్‌శాంటో ప్రకటించింది. అయితే పింక్ బోల్‌వార్మ్ తెగులును బిటి-2 తట్టుకోలేకపోవడంతో 2016-17 సీజన్‌లో ఏ రకం పత్తివిత్తనాలను వేయాలో నిర్ణయించుకోలేక రైతులు సతమతమవుతున్నారు. ఈ స్థితిలో ప్రభుత్వమే ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించాల్సి ఉంది. ఇలా ఉండగా ఇప్పటి వరకు బిటి పత్తి విత్తనాల ధరలను రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయిస్తూ వచ్చాయి. బిటి-2 (450 గ్రాములు) ప్యాకెట్ ధర మహారాష్ట్ర ప్రభుత్వం 830 రూపాయలుగా నిర్ణయించగా, తెలంగాణ, ఎపి ప్రభుత్వాలు 930 రూపాలుగా, పంజాబ్-హర్యానా ప్రభుత్వాలు 1000 రూపాయలుగా నిర్ణయించాయి. ఈ విధంగా దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకమైన ధర నిర్ణయం అవుతుండటంతో కేంద్రం జోక్యం చేసుకుని 2016-17 నుండి అమలయ్యే విధంగా బిటి పత్తివిత్తనాల ధరలను (ఎంఎస్‌పి) నిర్ణయించాలని భావించింది. ఇందుకోసం తొమ్మిది మందితో కూడిన ఉన్నతస్థాయి కమిటీని కేంద్రం నియమించింది. ఈ కమిటీలో రైతు ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన పి. సుగుణాకర్‌రావు (కరీంనగర్ జిల్లా) ను నియమించారు. ఈ కమిటీ ఇప్పటి వరకు బిటి-1, బిటి-2 పత్తివిత్తనం ధరలను ప్రకటించలేదు.
తక్కువ ధరకే ఇవ్వచ్చు: రైతు నర్సింహారెడ్డి
మోన్‌శాంటో కంపెనీ వసూలు చేస్తున్న రాయల్టీ (ట్రైట్ వ్యాల్యూను) తగ్గించుకుంటే రైతులకు తక్కువ ధరకే బిటి పత్తి వితనాన్ని విక్రయించేందుకు వీలుంది. మోన్‌శాంటో తన వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశీయ కంపెనీలకు అందిస్తూ రాయల్టీ వసూలు చేస్తోంది. రాయల్టీతో పాటు ఓవర్‌హెడ్ చార్జీల పేరుతో ఒక్కో ప్యాకెట్ బిటి పత్తివిత్తనంపై 482 రూపాయలు బిటి-2 రకంపై, 422 రూ.లు బిటి-1 రకంపై వసూలు చేస్తున్నారు. ఈ భారం చివరకు రైతుమీదే పడుతోంది. ఏటా కొన్ని వేలకోట్ల రూపాయలు రైతులు నష్టపోతున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం ఆలోచించి రైతులపై భారం తగ్గించాలి.
వారంలోగా నిర్ణయిస్తాం: సుగుణాకర్
బిటి పత్తివిత్తనం ధరను వారం రోజుల్లో నిర్ణయిస్తాం. కాటన్ సీడ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్‌ను జారీ చేసే కమిటీ బుధవారం ఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించాం. లైసెన్స్ విధివిధానాలు, చట్టపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ధరల నిర్ణయంపై సవివరంగా చర్చించాం. ప్రస్తుతం ఒక్కో ప్యాకెట్ విత్తనాల ధరలపై (బిటి-1 ధర 830 రూ.లు, బిటి-2 ధర 930 రూ.లు) సవివరంగా చర్చించాం. ఎంత మేరకు ఈ ధరలను తగ్గించవచ్చో వచ్చే వారంలోగా నిర్ణయిస్తాం.
ప్రత్యామ్నాయం లేదు: శాస్తవ్రేత్త
బిటి-1, బిటి-2 పత్తివిత్తనాలకు ప్రస్తుతం ప్రత్యామ్నాయం లేదు. దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో బోల్‌వార్మ్ తెలుగును తట్టుకునే విత్తనాలను రూపొందించడంలో పరిశోధన జరిపేందుకు తగిన నిధులు లభించడం లేదు. జన్యుపరంగా పత్తివిత్తనాల్లో మార్పు చేస్తూ మోన్‌శాంటో రూపొందించిన బిటి-1, బిటి-2 రకాలను వాడక తప్పడం లేదు. వీటి ధరలను ప్రభుత్వమే నియంత్రించాల్సి ఉంటుంది.