తెలంగాణ

మే 2న ఎమ్సెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎమ్సెట్ నోటిఫికేషన్‌ను జెఎన్‌టియు హైదరాబాద్ జారీ చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తులను 28నుండి స్వీకరిస్తారు. దరఖాస్తులను పంపించేందుకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మార్చి 28 వరకూ గడువుంది. అభ్యర్ధులు తమ డాటాలో మార్పులుంటే సవరించుకునేందుకు ఏప్రిల్ 3 నుండి 13 వరకూ గడువుంటుంది. 500 రూపాయిల జరిమానాతో ఏప్రిల్ 3వరకూ, వెయ్యి రూపాయల జరిమానాతో ఏప్రిల్ 13 వరకూ, 5వేల రూపాయల జరిమానాతో ఏప్రిల్ 22 వరకూ దరఖాస్తులు సమర్పించవచ్చు. హాల్‌టిక్కెట్లను ఏప్రిల్ 24 నుండి డౌన్‌లోడ్ చేసుకునే వీలుంది. ఏప్రిల్ 30 వరకూ డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పిస్తారు. పది వేల రూపాయిల జరిమానాతో ఏప్రిల్ 29 వరకూ అభ్యర్ధులు దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే అటువంటి వారందరికీ కేవలం హైదరాబాద్ కేంద్రాన్ని మాత్రమే ఇస్తారు. మే 2న ప్రవేశపరీక్ష జరుగుతుంది. ఇంజనీరింగ్ పరీక్ష మే 2 ఉదయం 10 నుండి 1గంట వరకూ, అగ్రికల్చర్- మెడిసిన్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకూ జరుగుతుంది. ప్రాథమిక కీని మే 3న ప్రకటిస్తారు. కీపై ఏమైనా అభ్యంతరాలుంటే వాటిని మే 9 వరకూ స్వీకరిస్తారు. తుది ర్యాంకులను మే 12న ప్రకటిస్తారు. దరఖాస్తు రుసుం ఎస్సీ, ఎస్టీలకు 250 రూపాయలు ఉంటుందని, ఇతరులకు 500 రూపాయలు ఉంటుందని ఎమ్సెట్ కన్వీనర్ చెప్పారు. తెలంగాణలో మొత్తం 15 రీజనల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, హైదరాబాద్ రీజనల్ కేంద్రాలుగా ఉంటాయి. హైదరాబాద్‌ను ఎనిమిది జోన్లుగా విడదీశారు. జోన్-1 పరిధిలోకి కూకట్‌పల్లి, జోన్-2లోకి కుత్బుల్లాపూర్, జోన్-3లోకి మెహిదీపట్నం, జోన్-4లోకి మాసాబ్‌ట్యాంకు, జోన్-5లోకి ఉస్మానియా వర్శిటీ, జోన్-6లోకి సికింద్రాబాద్, జోన్-7లోకి ముషీరాబాద్, జోన్-8లోకి రాజేంద్రనగర్ ప్రాంతాలు వస్తాయి.