రాష్ట్రీయం

ఆగమాలు అనుమతిస్తే మూలవిరాట్టు సేవలు ప్రత్యక్షప్రసారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 20: ఆగమ శాస్త్రాలు అనుమతిస్తే మూలవిరాట్టుకు జరిగే సేవలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని టీటీడీ ఈఓ ఏకే సింఘాల్ అన్నారు. ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు చేసిన ఆరోపణలపై ఆదివారం అన్నమయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈఓ మాట్లాడుతూ స్వామివారి ఆభరణాలు, కైంకర్యాలపై భక్తుల్లో అనుమానాలు పొడచూపే విధంగా జరుగుతున్న ప్రచారాలు దురదృష్టకరమన్నారు. అలాగే స్వామివారి ఆభరణాలను కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న త్రీడీ డైమన్షన్ పరిజ్ఞానంతో భక్తులకు అందుబాటులో ఉంచవచ్చునన్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆభరణం 360 డిగ్రీల్లో భక్తులు చూసే అవకాశం ఉంటుందన్నారు. ఇందుకు ప్రస్తుతం ఉన్న భద్రత సరిపోకపోతే అదనంగా కూడా తీసుకువస్తామన్నారు.