రాష్ట్రీయం

వైకాపా నేత సోమయాజులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల సభ్యుడు సోమయాజులు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంత కాలంగా శ్వాస సంబంద వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తను తెలుసుకున్న పార్టీ అధ్యక్షుడు జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వైఎస్ హాయంలో ఆర్థిక సలహాదారుగా ఉన్న సోమయాజులు, ఆయన మరణానంతరం ఏర్పాటు చేసిన వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ఎత్తుగడలపై సలహాలను అందించే సోమయాజులు మృతి పార్టీకి తీరని లోటని ఆ పార్టీ నేతలు అన్నారు.
మరణ వార్త తెలుసుకున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో పాటు వివిధ పార్టీల నేతలు, సినీ రంగ ప్రముఖులు ఆయన బౌతిక కాయాన్ని సందర్శించి నివాళ్ళర్పించారు.
శ్రీమన్నారాయణ మృతి పట్ల సంతాపం తెలిపిన టీడీపీ నేతలు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లూరి రమాదేవి తండ్రి పాములపాటి శ్రీమన్నారాయణ మృతి చెందారు. ఆయన మరణ వార్త ను తెలుసుకున్న టీటీడీపీ అధ్యక్షుడు రమణ, పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి తమ సంతాపాన్ని తెలియజేశారు. శ్రీమన్నారాయణకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.