రాష్ట్రీయం

మనల్ని మోసం చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మే 21: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కుట్ర రాజకీయాలు చేస్తూ రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీజేపీ, వైకాపా కుట్రలు, కుతంత్రాలను ఇకపై సాగనీకుండా చిత్తుగా ఓడించి పుట్టగతులు లేకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం అనంతపురం జిల్లా రొద్దం మండలం తురకలాపట్నం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు విభజన అనంతరం కట్టుబట్టలతో బయటకు వచ్చిన రాష్ట్ర ప్రజలకు కేంద్రం సహకరించలేదన్నారు. ‘ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని నమ్మబలికారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అందువల్లే 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. అయితే కేంద్రం అన్యాయం చేసింది. బీజేపీతో పొత్తు కారణంగా 15 స్థానాలు కోల్పోయాం’అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పినప్పటికీ, 11 రాష్ట్రాలకు హోదాతో సమానంగా కేంద్రం ఆర్థిక సాయం చేసింది. కానీ ఏపీకి మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదు.. ఆర్థిక సాయమూ చేయలేదు. దీంతో కేంద్రంలోని ఎన్‌డీఏ భాగస్వామ్య బీజేపీతో తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చాం’ అని చంద్రబాబు అన్నారు. కర్ణాటకలోనూ కుట్ర రాజకీయాలకు బీజేపీ తెర తీసిందని, అందుకే ఆ పార్టీని ఓడించాలని అక్కడి తెలుగువారిని కోరామన్నారు. అక్కడ బీజేపీ ఓడిపోయినందుకు ఆనందంగా ఉందన్నారు. సుప్రీంకోర్టు సరైన నిర్ణయం తీసుకోవడం వల్లే కర్నాటకలో బీజేపీకి అధికారం దక్కకుండా పోయిందన్నారు. జేడీఎస్ అధినేత కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారంటే సుప్రీంకోర్టు చూపిన చొరవ తప్ప మరొకటి కాదని కొనియాడారు. ‘నాకు రాష్ట్భ్రావృద్ధే ముఖ్యం.. నన్ను అవినీతి పరుడంటున్నారు..నన్ను విమర్శించే హక్కు ఏ పార్టీకీ లేదు. నా హయాంలో ఏ ఒక్క కుంభకోణమూ లేదు.. అవినీతి ఆరోపణలు లేవు. నాపై వేసిన వేసిన కేసులు వీగిపోయాయి. నా పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ ఉన్నా నిరూపించండి’ అంటూ సీఎం సవాల్ విసిరారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాలు, అవినీతిని ప్రక్షాళన చేస్తున్నానన్నాను. అనంతపురం జిల్లా లేపాక్షిలో సెజ్ అవినీతికి తార్కాణంగా నిలిచిందన్నారు. కదిరి ప్రాంతంలో సైన్స్ సిటీకి అడ్రస్ లేదంటూ ధ్వజమెత్తారు. రాష్ట్భ్రావృద్ధే తన ఏకైక లక్ష్యమన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ యూ టర్న్ తీసుకున్నారని బాబు ఆరోపించారు. నిన్న మొన్నటి వరకు తనను పొగిడిన పవన్ ఇప్పుడు అవినీతి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సుపరిపాలన ద్వారా అవినీతిని పూర్తిగా నిర్మూలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి అన్నారు. ఎవరు అవినీతిని ప్రోత్సహించినా సహించేది లేదని హెచ్చరించారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై ఏసీబీ అవినీతి కేసుల్లో 11 ఛార్జ్‌షీట్స్ దాఖలు చేసిందని, రూ. 43 వేల కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవ చేస్తానని జనంలోకి వచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను అడిగితే జగన్ చిట్టా చెబుతారని పవన్‌కు సీఎం సూచించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏమైందని అని అడుగుతున్నానన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల బ్యాంకులపై నమ్మకం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై బీజేపీ కుట్రలు, కుతంత్రాలు ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదని, ఈ పోరాటం ఆగదని అన్నారు. బీజేపీ, వైకాపా కలిసి చేస్తున్న కుట్ర రాజకీయాలు సాగవని చెప్పాల్సి ఉందని అన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం, విభజన హామీలు సాధించేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల్ని అదుపులో పెట్టామని, ఎర్రచందనం అక్రమ రవాణాను నిరోధించామని, మావోయిస్టులను అణచి వేశామని, చిట్‌ఫండ్ కంపెనీల ఆగడాల్ని అరికట్టామని అన్నారు.