రాష్ట్రీయం

ఆప్మెల్‌పై ఏపీ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: సింగరేణికి అనుబంధ సంస్థగా కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (ఆప్మెల్) స్వాధీనానికి ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నిపుణుల కమిటీ నివేదికను సాకుగా చూపించి రాష్ట్ర విభజన చట్టం వక్రీకరణతో అత్యంత విలువైన ఆస్తులు కలిగివున్న ఆప్మెల్‌ను ఏపీ సర్కారు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నదని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి సోమవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గాబాకు లేఖ రాశారు. సింగరేణిలో 51:49 శాతం వాటా కలిగిన తెలంగాణకు, కేంద్రానికి నష్టం కలిగిస్తూ ఏపీ మాత్రమే పెద్దఎత్తున లాభపడే ఎత్తుగడ వేసిందని తన ఫిర్యాదులో సిఎస్ జోషి వివరించారు. షెడ్యూల్ 9 పరిధిలోని సంస్థల పంపిణీలో వివాదాలు, సందేహాలు ఉత్పన్నమైతే కేంద్రం జోక్యం చేసుకొని పరిష్కారించాలని విభజన బిల్లు సెక్షన్ 71(ఎ)లో స్పష్టంగా పేర్కొందని ఆ లేఖలో గుర్తు చేసారు. ఆప్మెల్ ఎండీ చేసిన సిఫారసులకు విరుద్ధంగా, నిపుణుల కమిటీ సభ్యుడు లేవనెత్తిన అంశాలకు భిన్నంగా షీలాబేడీ నేతృత్వంలోని కమిటీ చట్టాన్ని తప్పుగా అన్వయిస్తూ నివేదిక ఇవ్వగా, ఏపీ సర్కారు సైతం దీన్ని ఆమోదించి తప్పిదం చేసిందని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. సింగరేణికి ఆప్మెల్ అనుబంధ సంస్థగా కొనసాగుతుండగా తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం, భారత ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉండగా ఆప్మెల్‌లో సింగరేణికి 81.5 శాతం, ఏపీఐడిసీకి 5.79 శాతం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి 0.86 శాతం, పబ్లిక్ షేర్ హోల్డర్స్‌కు 11.81 శాతం వాటాలున్నాయని సీఎస్ పేర్కొన్నారు. ఏ ప్రాంతంలో ఉన్న సంస్థలు ఆ ప్రాంత రాష్ట్రానికే చెందుతాయని విభజన చట్టంలో పేర్కొన్న అంశాన్ని ఆసరాగా చేసుకుని ఆప్మెల్ తమకే చెందుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తుందన్నారు. ఈ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకిస్తుండగా, ఆప్మెల్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా తమ సంస్థ సింగరేణికి చెందినది కావవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిధిలోకి రాదని నిపుణుల కమిటీకి స్పష్టం చేసారని సిఎస్ తన లేఖలో గుర్తు చేసారు. నిపుణుల కమిటీలో సభ్యుడిగా ఉన్న ఎకె గోయల్ కూడా ఆప్మెల్ సింగరేణికే చెందుతుందని స్పష్టం చేసారన్నారు. ఈ అభ్యంతరాలను పట్టించుకోకుండా షీలాబేడీ కమిటీ ఆప్మెల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించాలని ప్రతిపాదించడం, దీనికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏకపక్షంగా ఆమోదించిందన్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఆప్మెల్ ఆంధ్రప్రదేశ్‌కు చెందకుండా పోరాడాలని తెలంగా ప్రభుత్వం నిర్ణయించింది. అప్మెల్‌లో 81.54 శాతం ఉన్న సింగరేణికే చెందుతుందని, దీనిపై సింగరేణి సంస్థలో వాటాదారులైన తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకే హక్కు ఉంటుందని సిఎస్ పేర్కొన్నారు. ఆప్మెల్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేవలం 0.86 వాటా మాత్రమే ఉండగా అందులో తిరిగి తెలంగాణకు 42 శాతం వాటా ఉంటుందని ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ వాటా 0.5 శాతం కూడా ఉండదన్నారు. అలాంటప్పుడు ఆప్మెల్ మొత్తం తమదేనని ఆంధ్రప్రదేశ్ వాదించడం సమంజసం కాదని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్మెల్‌కు విజయవాడలోనే కాకుండా కొండపల్లిలో విలువైన ఆస్తులు ఉండటంతో వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిసుందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. సింగరేణికి నష్టం కలుగడమంటే అందులో వాటాలున్న తెలంగాణ రాష్ట్రానికే కాకుండా కేంద్రానికి కూడా నష్టం కలుగడమేనన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలకు అడ్డుకట్ట వేయాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది.