రాష్ట్రీయం

రాష్టప్రతి పాలనే మంచిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 21: కర్నాటకలో తలెత్తిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాష్టప్రతి పాలన విధించడమే సరైన నిర్ణయమని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎస్ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కర్నాటకలో ఏ పార్టీకీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే మెజారిటీ రాలేదు. అలాంటి పరిస్థితుల్లో రాష్టప్రతి పాలన విధించడమే సరైన నిర్ణయం’ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్, జెడీ(ఎస్)ల్లో ఎవరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే బలం లేదన్న అంశంపై స్పందిస్తూ ‘గవర్నర్ విజూభాయ్ వాలా మూడు నెలలపాటు రాష్టప్రతి పాలన విధించి ఉండాల్సింది. ఆ సమయంలోనూ ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయివుంటే, సభను రద్దుచేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాల్సింది’ అని ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘ఎన్నికల్లో గెలుపోటముల నిర్ణయానికి దామాషా విధానాన్ని అనుసరించడమే సరైన పద్ధతి’గా వివరించారు. దీనివల్ల సాధించిన ఓట్ల శాతాల ఆధారంగా రాజకీయ పార్టీలకు స్థానాలు నిర్ణయమవుతాయన్నారు. లేదూ 33.33 శాతం ఓట్లు సాధించిన అభ్యర్ధే గెలిచినట్టు నిర్ణయించాలన్నారు. ఏ అభ్యర్థికీ 33.33 శాతం ఓట్లు రాకపోతే, ఆ నియోజకవర్గంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఇప్పటికే చాలా దేశాల్లో 51 శాతం ఓట్లు సాధించినవారే విజేతలన్న నియమాన్ని అమలు చేస్తున్నట్టు వివరించారు. భారత్‌లో అంతకాకున్నా మొదటిసారి 33.33 శాతం ఓట్లు సాధించాలన్న నిబంధనను అమల్లోకి తెచ్చి, తరువాతి పదేళ్లలో 50 శాతం ఓట్లు పోలైనవాళ్లే విజేతలుగా నిర్ణయించే విధానాన్ని అమల్లోకి తేవాలన్నారు.