రాష్ట్రీయం

బ్రహ్మోస్.. సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాసోర్ (ఒడిశా), మే 21: భారత్-రష్యా సంయుక్త ప్రాజెక్టుగా అత్యాధునిక ఫీచర్లతో రూపొందించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఓడిశా తీరం నుంచి భారత్ విజయవంతంగా పరీక్షించింది. చండీపూర్‌కు సమీపంలోని బాలాసోర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లాంచ్ ప్యాడ్ 3 నుంచి సోమవారం ఉదయం 10.40 సమయంలో క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్టు భారత రక్షణ పరిశోధన అధికారులు వెల్లడించారు.
ప్రస్తుత పరీక్షా ప్రయోగానికి చాలా ప్రాధాన్యత ఉందని, భారత రక్షణ పరిశోధన, బ్రహ్మోస్ బృందాలు ఈ క్షిపణిని మరింత పదునుదేల్చాయని ఓ అధికారి వివరించారు. ‘సరికొత్త సాంకేతిక విధానంతో బ్రహ్మోస్‌ను మరింత పదునుదేల్చి విజయవంతంగా పరీక్షించిన డీఆర్‌డీవో, బ్రహ్మోస్ బృందాలకు అభినందనలు’ అంటూ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేసినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ సిబ్బంది వెల్లడించారు. ప్రస్తుత పరీక్షల ఫలితాలతో క్షిపణుల భర్తీలో భారీ వృధాను నివారించే ఆవిష్కరణలు సాధ్యమైనట్టేనని ఓ అధికారి వెల్లడించారు. ఈ తరహా క్షిపణులు ఇప్పటికే ఆర్మీ, నేవీకి అందుబాటులోకి వచ్చాయని, ఇప్పుడు వైమానిక దళాల ప్రయోగానికీ ప్రస్తుత పరీక్షతో వీలు కల్పించినట్టయ్యిందని డీఆర్‌డీవో శాస్తవ్రేత్త ఒకరు వెల్లడించారు.