రాష్ట్రీయం

బీల ఉద్యమానికి అండగా ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, మే 21: బీల ఉద్యమానికి జనసేన పార్టీ చివరివరకు అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ బీల ఉద్యమకారులకు భరోసా ఇచ్చారు. బస్సు యాత్రలో భాగంగా సోమవారం ఇచ్ఛాపురం నుంచి సోంపేట మీదుగా బీలకు చేరుకొని బీలలో ఏర్పాటు చేసిన అమరుల స్థూపం వద్ద ఉద్వేగభరితంగా ప్రసంగించారు. శ్రీకాకుళం జిల్లా, సోంపేట బీలలో థర్మల్ జీవోను రద్దు చేసి ఆక్వా పరిశ్రమల పేరుతో కొత్తగా చెరువుల తవ్వకాలను ఆయన దుయ్యబట్టారు. అభివృద్ధి పేరుతో ఒకసారి మోసపోయిన బీల ప్రాంత రైతులకు మరోమారు ప్రభుత్వం చెరువుల పేరుతో మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. ఉద్యమాల పురిటిగెడ్డ అయిన సిక్కోలులో సోంపేట ఉద్యమం గుర్తింపు పొందిందని, అటువంటి ఉద్యమాన్ని నడిపిన ఉద్యమకారులకు ప్రత్యేక అభినందనాలు తెలిపారు. అభివృద్ధి పేరుతో బీల ప్రాంతాన్ని ధ్వంసం చేయాలని చూస్తే ఉద్యమకారులతోపాటు జనసేన పార్టీ అంతా అండగా ఉండి బీలను కాపాడుకుంటామని శపథం చేసారు. అక్కడి నుంచి నేరుగా కాశీబుగ్గకు చేరుకొని ప్రజలకు అభివాదం చేసారు.