రాష్ట్రీయం

బాబుకు ప్రతి అంశమూ రాజకీయమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 21: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి అంశాన్ని కూడా రాజకీయ కోణంలోనే చూస్తూ తనను ఏ కులం వారు విమర్శిస్తే ఆ కులం వారితోనే తిట్టిస్తూ కాలం వెళ్లదీస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఆలయాల్లో జరిగే అన్యాయాలపై నోరు మాట్లాడే హక్కు అర్చకులకు ఉందన్నారు. అర్చకులు దళితవాడలకు వెళ్లి దళిత సోదరులకు తీర్థ ప్రసాదాలు, భగవత్ ఆశీర్వాదాన్ని ఇచ్చిననాడే గ్రామాల్లో అర్చకులకు తగిన గుర్తింపు, గౌరవం, ఆదరణ లభించగలదన్నారు. విజయవాడలోని గాయత్రీ కనె్వన్షన్ హాలులో బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరైన ఐవైఆర్.. బాబు పనితీరుపై ఘాటైన విమర్శలు చేశారు. ఆగమ శాస్త్రంలో ఉత్తీర్ణుడు కాని వారిని టీటీడీ ప్రధాన అర్చకునిగా ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తూ రమణ దీక్షితులను కొందరు బ్రాహ్మణులచే తిట్టించడం దారుణమన్నారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో అర్చకులకు పదవీ విరమణ లేదని చెప్పి ఇప్పుడు 65 ఏళ్లకే పదవీ విరమణ ప్రకటించడం దారుణమన్నారు. దానివల్ల రాష్ట్రంలో వేలాది అర్చకుల జీవితాలు అగమ్య గోచరంగా మారతాయన్నారు. రమణ దీక్షితులను కొనసాగిస్తూ అవసరమైతే ఆయన ఆరోపణలపై సీబీఐచే విచారణ జరిపించాలని ఐవైఆర్ డిమాండ్ చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు కేటాయిస్తామన్న సీఎం ఇప్పటివరకు ఎన్ని కోట్లు విడుదల చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. బాబు ఈ రాష్ట్రానికి ఏమి చేస్తున్నారో తెలియదు కాని ఎప్పుడూ బిజీగా కన్పిస్తుంటారు.. తాను పనిచేస్తున్నానని అందరికీ తెలియాలన్న తపన మినహా అక్కడ జరిగేది తక్కువేనని అన్నారు. పోలవరం ఎన్నోసార్లు వెళ్లానని అంటారు కాని అక్కడ పని ఎంత జరిగిందో అదే ముఖ్యమన్నారు. జీవో 76ను అమలుచేసి ఉంటే తానే బాబుకు బ్రహ్మరథం పట్టించేవాడినని అన్నారు. ప్రస్తుతం కరుడుగట్టిన కుల స్వామ్యంతో టీడీపీ నడుస్తున్నదని అన్నారు. బాబు తన కోటరీ మాటలు విని అక్రమాలపై ప్రశ్నించేవారి భరతం పడుతున్నారని అన్నారు. గత 30 ఏళ్లుగా రాష్ట్రంలో వేలాది చిన్న చిన్న ఆలయాలు మూతబడుతూ వస్తుండగా గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఈ సభలో నగర వైకాపా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, భువనేశ్వరీ పీఠాధిపతి సత్యానంద భారతీస్వామి, బ్రాహ్మణ సంఘాల నేతలు ద్రోణంరాజు రవికుమార్, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, కొప్పరపు బలరామ కృష్ణమూర్తి, తదితరులు ప్రసంగించారు.