రాష్ట్రీయం

గుర్గావ్‌లో దొరికిన సీతారామారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ విజయవాడ, మే 22: కొంతకాలంగా రాష్ట్రాన్ని కుదిపేస్తున్న అగ్రిగోల్డ్ కేసులో కీలక నిందితుడు అవ్వా సీతారామారావును సీఐడీ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున గుర్గావ్‌లో అరెస్ట్ చేశారు. సీతారామారావు గతంలో అగ్రిగోల్డ్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించారు. కంపెనీ లావాదేవీలను తెరవెనుక నుంచి నడిపించేవారు. అగ్రిగోల్డ్‌పై కేసు తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ కోసం ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్‌ను సంప్రదించారు. అయితే హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం జైల్లో ఉన్న తన వారిని వెలుపలకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం రావటంతో పోలీసులు నిఘా పెట్టారు. ఇదిలావుండగా అగ్రిగోల్డ్ సంస్థలను వేలంలో కొనేందుకు ముందుకొచ్చిన ఎస్సెల్ గ్రూప్ సంస్థలను సీతారామారావు ప్రభావితం చేస్తున్నట్లు బాధితులు ఎప్పటి నుంచో ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న సీతారామారావును సీఐడీ పోలీసులు గుర్గావ్‌లో అరెస్ట్ చేశారని, నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపర్చి ట్రాన్సిట్ వారెంట్‌పై బుధవారం విజయవాడకు తీసుకువచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అసలు అగ్రిగోల్డ్ ఆస్తులు ఎంత.. ఏమేర లావాదేవీలు జరిగాయి అనే విషయాలపై సీతారామారావును పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది.