రాష్ట్రీయం

తిరుమలలో తరగని రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 22: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం నాడు కొనసాగుతోంది. సర్వదర్శనానికి 50గంటల సమయం పడుతోంది. కాగా భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా 2.82కోట్లు ఆదాయం లభించింది. అలాగే ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు 24.30లక్షల రూపాయలు భక్తులు విరాళంగా ఇచ్చారు. కాగా సాయంత్రం ఏడుగంటల వరకు 54,140మంది స్వామివారిని దర్శించుకున్నారు. ఇక భక్తులు ఎక్కువ సమయం క్యూలైన్లలో నిరీక్షించకుండా టీటీడీ ప్రవేశపెట్టిన సమయ నిర్దేశిత కౌంటర్లు కూడా నిరుపయోగంగా మారాయనే చెప్పాలి. దీంతో తిరుమలలో తాత్కాలికంగా ఈ సమయ నిర్దేశిత కౌంటర్లను మూసివేస్తున్నట్లు జేఈవో ప్రకటించారు. అయితే తిరుపతిలో యధావిధిగా కొనసాగుతాయి. కౌంటర్లు సంఖ్య ఎక్కువగా ఉన్నా, టోకెన్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయాని కన్నా ముందు వెళ్లడం, లేదా ఆలస్యంగా రావడం జరుగుతోంది. దీంతో ఒక సమయం నిర్దేశించిన భక్తులు, ఆలస్యంగా, ముందుగా వస్తున్న భక్తులు క్యూలైన్ల వద్దకు చేరడంతో రద్దీ పెరిగిపోతోంది. దీంతో దర్శన సమయం కూడా గణనీయంగా పెరిగిపోయింది.
వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో భక్తులు అవస్థలు పడకుండా టీటీడీ ఇఓ అధికారులతో సమీక్షిస్తూ తగు ఆదేశాలు జారీ చేస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి వచ్చే భక్తులు ఎక్కువ సమయం కంపార్టుమెంట్‌లో, క్యూలైన్లలో నిరీక్షించకుండా ఉండాలనే సత్సంకల్పంతో ఏర్పాటు చేసిన సమయ నిర్దేశిత దర్శనం కౌంటర్లను అధిక రద్దీ కారణంగా తిరుమలలో తాత్కాలికంగా మూసివేస్తున్నామని, పునఃసమీక్షించిన అనంతరం తిరిగి తెరిచే తేదీని తెలియజేస్తామని తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు చెప్పారు. అయితే తిరుపతిలో యథావిధిగా ఈ టోకెన్లు జారీ చేస్తామన్నారు. రద్దీ ఎక్కువైన సందర్భంలో తిరుమలలో టోకెన్ల విధానాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేశామన్నారు. లేపాక్షి సర్కిల్ నుండి సర్వదర్శనం క్యూలైన్ ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టామన్నారు.