రాష్ట్రీయం

మావోల వేటకు ‘బ్లాక్ పాంథర్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 22: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టుల చర్యలను అడ్డుకునేందుకు కేంద్రం ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపనున్నది. వారిని నిలువరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ బ్లాక్‌పాంథర్ బలగాలను ఏర్పాటు చేసి పంపాలని సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు పేరొందిన గ్రేహౌండ్స్ తరహాలోనే ఈ ప్రత్యేక దళాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కొక్క దళంలో 40నుండి 60మంది పోలీసులు అధునాతన ఆయుధాలతో ఉండనున్నారు. వీరందరు ఇప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాలలో శిక్షణ పొందుతున్నారు. ఈ ఎడాది చివరిలో చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముందస్తుగానే ఈ దళాలను పంపనున్నారు. జూలై నెలలో దేశంలోనే తొలిసారిగా చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో ఈ బలగాలు ప్రవేశించనున్నాయి. ఇదిలా ఉండగా సరిహద్దులోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు చెందిన వారితో ప్రత్యేకంగా బస్తరియా పేరుతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేశారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మ, బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ జిల్లాలకు చెందిన వారితో ఏర్పాటు చేసిన ఈ దళం ద్వారా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో గాలింపు జరిపే పోలీసులకు సహకారం అందించనున్నారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో అత్యంత తీవ్రవాద ప్రభావిత ప్రాంతంగా పేరున్న బస్తర్ పేరుతోనే ఈ దళాన్ని ఏర్పాటు చేయటం గమనార్హం.