రాష్ట్రీయం

ఉగ్రవాదం ఓ పెద్ద సవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 29: నేడు ప్రపంచంలో ఉగ్రవాదం ఓ పెద్ద సవాల్‌గా పరిణమించిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం వుడా పార్కులో జిమ్-2015 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, మాట్లాడారు. వసుధైక కుటుంబం భారత లక్ష్యమని అన్నారు. ప్రపంచంలో మానవులంతా శాంతియుతంగా ఉండాలని మనం కోరుకుంటున్నామని గుర్తు చేశారు. ఇటువంటి తరుణంలో ఉగ్రవాదం ఓ పెనుభూతంలా మారిందని, దీనిని యువత తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఏ దేశానికైనా యువత వెనె్నముక వంటిదని, మన దేశంలో యువత అత్యధికంగా ఉన్నందున వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలను ఆరోగ్యంగా ఉంచాలన్నదీ మన రాజ్యాంగంలోని నిర్ధేశిక నియమాల్లో పేర్కొన్న విషయంగా గుర్తు చేశారు. యువతకు విద్యతోపాటు ఆరోగ్యకరమైన అలవాట్లు ముఖ్యమన్నారు. దేశంలో యువతకు వివిధ రంగాల్లో శిక్షణకు, ఆరోగ్యానికి సంబంధించి రూ.37వేల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. దాంతోపాటు మరో రూ.57వేల కోట్లు యువత సంక్షేమానికి, ఇతర వాటి కోసం ఏటా వెచ్చిస్తున్నామని వివరించారు. ప్రపంచంలో తొలిసారిగా ఆర్యభట్టారకుడు గణితాన్ని కనుగొన్నదీ భారత్‌లోనేనని గుర్తు చేశారు. నేడు అగ్ని, వరుణ వంటి అస్త్రాలను పూర్వకాలంలో వినియోగించినట్టు మన పురాణాలు తెలుపుతున్నాయని అటువంటి గొప్ప వారసత్వాన్ని యువత అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.