రాష్ట్రీయం

ఇదేనా మీ పనితీరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: భూరికార్డుల ప్రక్షాళనకు వంద రోజుల వ్యవధి ఇచ్చినా కొన్నిచోట్ల రికార్డుల్లో తప్పులు దొర్లడం, అసమగ్ర వివరాలు ఉండటం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేసారు. కేవలం సాంకేతిక కారణాలు ఒక్కటే కాదు మానవ తప్పిదాలు కూడా జరిగాయని ఆయన అసహనం వ్యక్తం చేసారు. దీనివల్ల రైతులకు కొంత అసౌకర్యం కలగటంతో పాటు కొందరికి పాసు పుస్తకాలు అందలేదన్నారు. ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించినప్పుడు కొన్ని సమస్యలు తప్పవని, అయితే పరిస్థితిని సవాల్‌గా తీసుకుని పాసు పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీ నూటికి నూరు శాతం పూర్తయ్యే వరకు అధికార యంత్రాంగం విశ్రమించవద్దని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రగతి భవన్‌లో బుధవారం పట్టాదారు పాసు పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంపై స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలిసి ముఖ్యమంత్రి కలక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆధార్ కార్డును అనుసంధానం చేయడానికి ముందుకు రాని రైతుల పాసు పుస్తకాలను పక్కన పెట్టాల్సిందిగా సీఎం ఆదేశించారు. అసైన్డ్ భూములను కొన్న వారు పేదలయితే వారి పేర్ల మీదనే యాజమాన్య హక్కులు కల్పించి, రైతుబంధు పథకాన్ని వర్తింప చేయాల్సిందిగా సీఎం కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీ
కార్యక్రమాన్ని వందశాతం పూర్తయ్యే బాధ్యతను కలెక్టర్లతో పాటు మంత్రులు కూడా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎన్‌ఆర్‌ఐలకు చెందిన పాసు పుస్తకాలను అందజేయడానికి ప్రత్యేక విధానాన్ని అనుసరించాలని సూచించారు. భూ రికార్డులు అన్నింటినీ ధరణీ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేయనుండటంతో భూ రికార్డులన్నీ సక్రమంగా ఉండాలని, లేనిపక్షంలో ‘్ధరణి’ కార్యక్రమం నిర్వహించలేమన్నారు. భూ రికార్డులు సక్రమంగా నిర్వహించే విషయంలో అవినీతికి పాల్పడే వారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. అలాగే తప్పులు చేసిన వారిని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని గుర్తించి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి మండలంలో వందశాతం చెక్కులు, పాసు పుస్తకాల పంపిణీ పూర్తిచేసే బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించాలని, జిల్లాల్లో మంత్రులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలని ఆదేశించారు. భూ క్రయ విక్రయాలు మాన్యువల్‌గా మ్యుటేషన్ చేసిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి దాని ప్రకారమే కొత్త పాసు పుస్తకాలను ఇవ్వాలని సూచించారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసే విధానాన్ని నిలుపుదల చేయలేదని, ఈ విషయంలో తహసీల్దార్లకు స్పష్టత ఇవ్వాలని రెవిన్యూ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ‘రైతులు భూమిని నమ్ముకొని బతుకుతున్నారు, వీరిలో చాలామంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. ఒక ఎకరం లోపు భూమి ఉన్న రైతులు 18 లక్షల మంది ఉన్నారు, అలాంటి పేద రైతు చనిపోతే వారి కుటుంబం ఉన్నపళంగా అగాథంలో పడిపోతుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు మరణించిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింద’ని సీఎం వివరించారు. జీవిత బీమా సంస్థ ద్వారా రైతులకు బీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బీమా ఎలా ఉండాలనే దానిపై వారితో చర్చిస్తున్నామన్నారు. రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని, ప్రతి రైతుకు బీమా పట్టా ఇస్తామని, రైతులు సూచించిన వారినే నామినీలుగా చేర్చాలన్నారు.