రాష్ట్రీయం

నక్సల్స్‌పై మరింత నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: దేశంలో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం పీచమణిచేందుకు కేంద్రం కీలకమైన నిర్ణయం తీసుకుంది. సమాచార వ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా పది రాష్ట్రాల్లో 4072 మొబైల్ టవర్లను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. బుధవారం ఇక్కడ ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది. అనేక అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే 2329 మొబైల్ టవర్లను రూ. 3167 కోట్లతో నిర్మించారు. ఆంధ్రప్రదేశ్‌లో 429, తెలంగాణలో 118 మొబైల్ టవర్లను నిర్మించాలని కేంద్రహోంశాఖ ప్రతిపాదన త్వరలో అమలవుతుంది. టెలి కమ్యూనికేషన్స్ శాఖకు చెందిన యూనివర్శల్ సర్వీసు ఆబ్లిగేషన్ ఫండ్ నుంచి నిధులు విడుదల చేస్తారు. దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాలు 90 ఉన్నాయి. ఇందులో 30 జిల్లాలు పూర్తిగా మావోయిస్టుల గుప్పిట్లో ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ వివరాలను హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గుబా చెప్పారు. గత నాలుగేళ్లలో వామపక్ష తీవ్రవాదం వ్యాప్తి తగ్గిందన్నారు. ఈశాన్యరాష్ట్రాల్లో మణిపూర్‌లో దేశంలోనే తొలి క్రీడా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాలని నిర్ణయించారు. ఈ వివరాలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఈ విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ
నెలకొల్పుతామని ప్రధానినరేంద్రమోదీ గతంలో ప్రకటించి బడ్జెట్లో రూ. 100 కోట్లను కేటాయించారు. ఇంఫాల్(పశ్చిమ) ప్రాంతంలో ఈ వర్శిటీని ఏర్పాటు చేస్తారు. దివాళా ప్రక్రియ చట్టం (ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంకరప్సీ కోడ్) సవరణలను కూడా కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. నష్టాల్లో ఉన్న స్కూటర్స్ లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ సంస్థ పునరుజ్జీవనానికి రిస్ట్రక్చర్ ప్లాన్‌కు కేంద్రం అంగీకరించింది. భారత్-డెన్మార్క్‌ల మధ్య ఫుడ్ సేఫ్టీపై అవగాహన ఒప్పందంకు కేంద్రం ఆమోద ముద్రవేసింది. సంప్రదాయేతర ఇంధన వనరులకు సంబంధించి మొరాకో, ఫ్రాన్స్ దేశాలతో రెండు వేరువేరు అవగాహన ఒప్పందాల ఆమోదానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది.