రాష్ట్రీయం

బాబు ఇంట్లో స్వామి నగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 23: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లో తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆభరణాలున్నాయని ఆరోపించారు. బుధవారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు హైదరాబాద్‌లో నిర్మించుకున్న భవనంలోను, అమరావతిలోని ఆయన అధికార నివాసంలోను వెంకటేశ్వరుని ఆభరణాలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు బృందాలు వెంటనే దాడి చేస్తే బయటపడతాయని, లేకుంటే దేశం దాటి వెళ్లిపోయే ప్రమాదం ఉందన్నారు. గతంలోనూ ఇటువంటి ఆభరణాలను దేశానికి ఆవల వేలం వేయించి, తద్వారా వచ్చిన వేల కోట్ల రూపాయలను విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు నివాసాల్లో వెంకటేశుని ఆభరణాలు దొరక్కపోతే మరు క్షణం తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని విజయసారెడ్డి సవాల్ విసిరారు. తిరుపతి వెంకన్న సొమ్మును దోచుకున్నవారు ఎవ్వరూ బాగుపడలేదని నాశనమైపోయారని విజయసాయిరెడ్డి అన్నారు. లోకేశ్‌పై వచ్చిన ఆరోపణలపై చంద్రబాబు సీబీఐతో విచారణ జరిపించాలని విజయశాయ డిమాండ్ చేశారు. చంద్రబాబు ధర్మపోరాటం ఎందుకు చేస్తున్నారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. దొంగలంతా కలిసి పోరాటం చేస్తున్నట్టుందని ఆక్షేపించారు. ప్రజలను రక్షించాల్సిన సీఎం ధర్మపోరాటం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

విజయసాయిరెడ్డి అరెస్ట్
స్థానిక ఆంధ్ర యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో మంగళవారం ధర్మపోరాట దీక్ష జరిగింది. ఆ సభా స్థలిని ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు, కార్యకర్తలు బుధవారం గంగా జలంతో శుద్ధి చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలిసిన తెలుగుదేశం పార్టీ నాయకులు సభా స్థలిలో ఎవరు అడుగుపెట్టినా ఎదుర్కొంటామని హెచ్చరించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసీపీ వారు 10మంది వస్తే, టీడీపీ కార్యకర్తలు వందమంది వారిని ఎదుర్కొంటారని హెచ్చరించారు. ఈనేపథ్యంలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయన్న ఉద్దేశంతో భారీ సంఖ్యలో పోలీసులు రంగప్రవేశం చేశారు. వర్శిటీ గ్రౌండ్స్‌కు నలువైపులా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి వర్శిటీ గ్రౌండ్స్‌కు ఊరేగింపుగా వెళ్లాలని నిర్ణయించిన నేతలను పోలీసులు అక్కడే నిలువరించారు. పోలీసులను తోసుకుంటూ వైకాపా కార్యకర్తలు రోడ్డెక్కారు. ఈనేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తరువాత విజయసాయిరెడ్డితోపాటు, పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.