రాష్ట్రీయం

హై ఓల్టేజ్ డైరెక్ట్ కరెంట్‌కు త్వరలో అటవీ అనుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 23: దేశంలో పశ్చిమ, దక్షిణ రీజియన్లను కలుపుతూ ఏర్పాటు కాబోతున్న హైఓల్టేజీ డైరెక్ట్ కరెంట్ పథకానికి జూన్ నెలాఖరులోగా కడప, చిత్తూరు జిల్లాల నుంచి అటవీ శాఖ అనుమతులు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ తెలిపారు. దేశంలో అమలవుతున్న 13 కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతిపై ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పశ్చిమ, దక్షిణ రీజియన్లు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడులను కలుపుతూ ఏర్పాటు కాబోతున్న హైఓల్టేజ్ డైరెక్ట్ కరెంట్ పనుల ప్రగతిని ప్రధాని తెలుసుకున్నారు.
నరేంద్ర మోదీకి కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భళ్లా వివరించారు. నాలుగు రాష్ట్రాల నుంచి అటవీ హక్కుల (ఆర్‌ఓఎఫ్‌ఆర్) గుర్తింపు రావాల్సి ఉందన్నారు. దీనిపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే కర్నూల్ జిల్లా నుంచి ఆర్‌ఓఎఫ్‌ఆర్ అందిందని, కడప, చిత్తూరు జిల్లాల నుంచి అటవీ హక్కుల అనుమతులు రావాల్సి ఉందని అన్నారు. జూన్ నెలాఖరులోగా ఈ అనుమతి పత్రాలు కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.