రాష్ట్రీయం

ఉపాధి వెల్లువ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎంత వెంపర్లాడినా ఫలితం కనిపించడం లేదు. సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం దగ్గర నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వరకూ దేనికైనా కమ్యూనికేషన్స్ స్కిల్స్, వృత్తి నైపుణ్యంతోపాటు ఆయా అభ్యర్థులు కళాశాలల్లో నేర్చుకున్న సబ్జెక్ట్ గురించి అడుగుతున్నారు. చాలా మంది అభ్యర్థులు వీటిలో ఫెయిల్ అవడం వలనే ఉద్యోగాలు లభించడం లేదు. ఈ పరిస్థితిని గమనించిన కేంద్ర ప్రభుత్వం స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్లు పెట్టి వృత్తి శిక్షణతోపాటు, ప్లేస్‌మెంట్స్ కూడా చూపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి, నిరుద్యోగులు ఎక్కడున్నారో, అక్కడే ఆయా కంపెనీలను పంపించి, వారి అర్హతను బట్టి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టింది. లుక్ ఫర్ ఎంప్లారుూస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (లీప్) పేరుతో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమి (ఏపీఐటీఏ) ఈనెల 15 నుంచి, 29 వరకూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. ఒక్కో జిల్లాల్లో రెండు రోజులపాటు ఈ జాబ్ మెళాలు నిర్వహిస్తోంది. లీప్ యాప్ లో రిజిస్టర్ చేసుకుని, బయోడేటా పొందుపరిస్తే, ఆ అర్హతకు సరిపడా ఉద్యోగాలు ఇచ్చేందుకు కంపెనీలే అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తాయి. గడచిన 10 రోజుల్లో జరిగిన జాబ్ మేళాల్లో సుమారు మూడు వేల మందికి ఉద్యోగాలు లభించాయి. సుమారు వెయ్యి మందిని ప్రముఖ కంపెనీలు షార్ట్ లిస్ట్ చేసి ఉంచాయి. అభ్యర్థులకు ఆయా జాబ్ మేళాల్లోనే ఆర్డర్స్ కూడా ఇచ్చేస్తున్నారు. రాష్టవ్య్రాప్తంగా జరుగుతున్న ఈ జాబ్ మేళాకు సంబంధించి ఏపీఐటీఏ సీఈఓ విని పాత్రో
మాట్లాడుతూ ఇప్పటి వరకూ తొమ్మిది జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహించినట్టు చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో చాలా మంది నిరుద్యోగులు కేవలం పదవ తరగతి, ఇంటర్మీడియట్ చదవిన వారే ఉన్నారని అన్నారు. అటువంటి వారికి కూడా ఉద్యోగాలు వచ్చేలా కొన్ని కంపెనీలను తీసుకువచ్చామని అన్నారు. కడప, కర్నూల్ జిల్లాల్లో సుమారు 800 మందికి ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రముఖ ఐటీ కంపెనీలు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయని, వారిలో కొంతమంది షార్ట్‌లిస్ట్ చేశారని చెప్పారు. ఇప్పటి వరకూ జరిగిన జాబ్ మేళాలో 40 నుంచి 50 శాతం మందికి మొబైల్ ఎలక్ట్రానిక్స్, బ్యాంకింగ్ రంగాల్లో ఉద్యోగాలు వచ్చాయని పాత్రో చెప్పారు. ఇప్పటి వరకూ జరిగిన జాబ్ మేళాలో 10 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారని చెప్పారు. ఒక అభ్యర్థి ఈ జాబ్ మేళాలు జరిగినన్ని రోజుల్లో ఎన్ని కంపెనీలకైనా ఇంటూర్వ్యూలకు హాజరు కావచ్చని అన్నారు. ఇదిలా ఉండగా ఇంటర్వ్యూలకు వెళ్లే ముందు అభ్యర్థులకు ఓరియంటేషన్ క్లాస్‌లు కూడా నిర్వహించామని అన్నారు. ఈ జాబ్ మేళాలో వేల కంపెనీలు వచ్చాయని పాత్రో తెలియచేశారు. మొత్తంమీద ఈ జాబ్ మేళాలో ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు ఆయన చెప్పారు.
చిత్రం..విశాఖ జిల్లా లంకెలపాలెంలో నిర్వహించిన జాబ్‌మేళా