రాష్ట్రీయం

ఇసుక దుమారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 24: తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ సమావేశం గురువారం రసాభాసగా మారింది. సమావేశంలో శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, వైసీపీకి చెందిన కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మధ్య ఇసుక వ్యవహారంపై తీవ్రస్థాయి వాగ్యుద్ధం జరిగింది. ఒక దశలో సంయమనం కోల్పోయిన డిప్యూటీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే జగ్గిరెడ్డిని అసభ్య పదజాలంతో దూషించారు. జడ్పీ ఛైర్మన్ జ్యోతుల నవీన్‌కుమార్ అధ్యక్షతన జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యింది. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభంలోనే అక్రమ ఇసుక రవాణాపై దుమారం చెలరేగింది. తొలుత జడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ జిల్లాలోని ఇసుక రీచ్‌ల నుండి
పొరుగు జిల్లాల్లో ప్రైవేటు నిర్మాణ సంస్థలకు ఇసుకను సరఫరా చేస్తున్నారంటూ అభ్యంతరం తెలియజేశారు. ఏ నిబంధనల ప్రకారం ఇక్కడి నుండి ఇసుక పొరుగు జిల్లాలకు తరలిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై కలెక్టర్ కార్తికేయ మిశ్రా వివరణనిస్తూ పొరుగు జిల్లాల్లో ఇసుక లభ్యత లేక అవసరాల నిమిత్తం ఆయా జిల్లాల కలెక్టర్లు లేఖలు రాయడంతో జిల్లా నుండి ఇసుకను సరఫరా చేస్తున్నామన్నారు.
ఈ నేపథ్యంలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి జిల్లాలో సాగుతున్న ఇసుక దందాపై ధ్వజమెత్తారు. ఇసుక రీచ్‌ల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, పేదలకు ఉచితంగా అందాల్సిన ఇసుక పెద్దలకు, ప్రైవేటు కంపెనీలకు తరలిపోతోందని ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతల అవినీతి కారణంగా ఈ దుస్థితి దాపురించిందన్నారు. దీంతో వేదికపై ఉన్న శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం జగ్గిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నువ్వే దొంగ, నీ పార్టీ దొంగల పార్టీ’ అని విరుచుకుపడ్డారు. ఇరువురూ ఒకరినొకరు దుర్భాషలాడుకున్నారు. ఓ దశలో మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి ఆగ్రహావేశాలతో ఊగిపోతూ జగ్గిరెడ్డిపై అసభ్య పదజాలాన్ని వాడారు. జగ్గిరెడ్డి పైకి వాటర్ బాటిల్స్ విసిరారు. నేతలు బూతులు తిట్టుకుంటుండటంతో వేదికపైవున్న కలెక్టర్ కార్తికేయ మిశ్రా అక్కడి నుండి వెళ్లిపోయారు. పరిస్థితి అదుపుతప్పి ఉద్రిక్తంగా మారడంతో ఛైర్మన్ జ్యోతుల నవీన్ సభను 15 నిముషాలు వాయిదా వేశారు.
ఇదిలావుండగా జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గానికే చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యం, చిర్ల జగ్గిరెడ్డి మధ్య ఇసుక వివాదం నివురు గప్పిన నిప్పులా రగులుతోంది. జడ్పీ సమావేశం వేదికగా ఒక్కసారిగా ఇవి రచ్చకెక్కాయి. కొత్తపేట నియోజకవర్గంలోని మగటపల్లి ర్యాంపు నుండి 500 క్యూబిక్ మీటర్ల ఇసుకను విశాఖ జిల్లాలోని ఓ ప్రైవేటు కంపెనీకి తరిలించేందుకు అనుమతులు జారీఅయ్యాయి. ఈ కంపెనీ రెడ్డి సుబ్రహ్మణ్యం బంధువులకు చెందినదని జగ్గిరెడ్డి ఆరోపించారు. అయితే ఇదే నియోజకవర్గంలోని గోపాలపురం ఇసుక ర్యాంపులో ఇసుకను యంత్రాలతో తవ్వుతున్నారని, ఈ వ్యవహారం వెనుక జగ్గిరెడ్డే సూత్రధారని రెడ్డి ఆరోపించారు. ఈ విధంగా నియోజకర్గంలో ఈ రెండు ర్యాంపుల వ్యవహారంపై జడ్పీలో రగడ జరిగింది. ఒక ర్యాంపు అధికార పార్టీకి చెందిన రెడ్డి కనుసన్నల్లోను. మరో ర్యాంపు ప్రతిపక్షానికి చెందిన చిర్ల జగ్గిరెడ్డి నాయకత్వంలో నడుస్తున్నాయన్న అంశంపై సభ్యుల్లో చర్చ జరిగింది. ఇదిలావుండగా తనపై చేసిన ఆరోపణలపై విచారించుకోవచ్చని వైసీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సవాల్‌చేశారు సభ వాయిదా అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ గోపాలపురం ర్యాంపులో తన ప్రమేయం ఉందని భావిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు కదా అని జగ్గిరెడ్డి ప్రశ్నించారు.

చిత్రాలు..ఆగ్రహంతో ఊగిపోతున్న మండలి డిప్యూటీ ఛైర్మన్
*రెడ్డి సుబ్రహ్మణ్యంను వారిస్తున్న జడ్పీ ఛైర్మన్ జ్యోతుల నవీన్