రాష్ట్రీయం

ఇంజనీరింగ్ స్ట్రీం ఎమ్సెట్ కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లకు గురువారం నాడు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ షెడ్యూలు విడుదల చేశారు. 25 నుండి కౌనె్సలింగ్ షెడ్యూలు మొదలవుతుంది. 8న సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఆన్‌లైన్ డాటా ఇవ్వడంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్‌కు 25వ తేదీ నుండి జూన్ 2 వరకూ అనుమతి ఇస్తారు. 28వ తేదీ నుండి జూన్ 3వ తేదీ వరకూ సర్ట్ఫికెట్ల పరిశీలన జరుగుతుంది. అన్ని ర్యాంకులకు సర్ట్ఫికెట్ల పరిశీలన ఈసారి ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. సమాంతరంగా మరో పక్క 28వ తేదీ నుండి జూన్ 5 వరకూ వెబ్ ఆప్షన్లకు వీలుకల్పిస్తారు. జూన్ 5న వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ ఉంటుంది. తొలి దశ సీట్ల కేటాయింపు జూన్ 8న జరుగుతుంది. సీట్లు పొందిన వారు జూన్ 8 నుండి 12వ తేదీలోగా ఫీజు చెల్లించి ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఇది ముగిసిన వెంటనే రెండో దశ కౌనె్సలింగ్ ప్రారంభం అవుతుంది. ఈసారి రెండు దశల్లో కౌనె్సలింగ్ పూర్తిచేసి, ఆయా కాలేజీల్లోనే స్లయిడింగ్‌కు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. రెండో దశ జూలై మొదటివారంలో ప్రారంభిస్తారు. క్లాసులు జూలై 16 నుండి ప్రారంభించడం వల్ల విద్యాసంవత్సరం గాడిలో పడుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి పేర్కొన్నారు.
సర్ట్ఫికెట్ల పరిశీలన
మే 28న 1 నుండి 5వేల ర్యాంకుల వరకూ, 29న 25వేల ర్యాంకు వరకూ, 30న 40వేల ర్యాంకు వరకూ, 31న 54 వేల ర్యాంకు వరకూ, జూన్ 1న 68వేల ర్యాంకు వరకూ, 2న 82 వేల ర్యాంకు వరకూ, 3న చిట్టచివరి ర్యాంకు వరకూ సర్ట్ఫికెట్ల పరిశీలన జరుగుతుంది. ప్రత్యేక కేటగిరి అభ్యర్ధులకు మాత్రం సాంకేతిక విద్యా భవన్‌లో మాత్రమే కౌనె్సలింగ్ నిర్వహిస్తారు. వారంతా 28, 29, 30, 31, జూన్ 1 తేదీల్లో షెడ్యూలు ప్రకారం హాజరుకావల్సి ఉంటుంది.
విధానం
అభ్యర్ధులు టిఎమ్సెట్ డాట్ నిక్ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజు లింక్‌ను క్లిక్ చేయాలి, వెంటనే రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ, ఇంటర్ హాల్‌టిక్కెట్ నెంబర్‌ను ఇవ్వాలి. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫారం వస్తుంది దానిని పూర్తి చేసి మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఇవ్వాలి. కులధృవీకరణ వివరాలు, ఆదాయ ధృవీకరణ వివరాలు సర్ట్ఫికెట్లపై ఉన్న నెంబర్లను నమోదు చేయాలి. డాటాను అప్‌డేట్ చేసి, ప్రాసెసింగ్ ఫీజు ఎస్సీ, ఎస్టీలు 600 రూపాయిలు , ఇతరులు 1200 రూపాయిలు చెల్లించాలి. తర్వాత అదే పోర్టల్‌లో కాలేజీల జాబితా, బ్రాంచిలు, జిల్లాలు డౌన్‌లోడ్ చేసుకోవాలి.