రాష్ట్రీయం

జూన్ 2న నవ నిర్మాణ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 24: కేంద్రం సహకరించకపోయినా, అభివృద్ధి సాధించామని, కేంద్రం అండదండలు ఉండి ఉంటే మరింత పురోగతి సాధ్యమయ్యేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో నవ నిర్మాణ దీక్ష ఏర్పాట్లపై గురువారం ఆయన సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవడం సమంజసం కాదని, రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, ఏ విధంగా వేడుకలు జరుపుకుంటాం? అంటూ వ్యాఖ్యానించారు. నాలుగేళ్లు గడిచినా, రాష్ట్రానికి న్యాయం జరగలేదని, ఏ విధమైన మేలు జరగలేదన్నారు. విభజన సమయంలో ఏపీ కన్నా తెలంగాణ వెనుకబడి ఉందని, ఏపీలో 1.4 శాతం జీఎస్‌డీపీ ఎక్కువగా ఉందని గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణ కంటే 4.6 శాతం మేర జీఎస్‌డీపీ ఎక్కువగా ఉందన్నారు.
విభజన జరిగి నాలుగేళ్లు కావస్తున్నా, తలసరి ఆదాయంలో ఇంకా వెనుకబడి ఉన్నామన్నారు. తెలంగాణ కంటే 32 వేల రూపాయలు వెనుకబడి ఉన్నామని, దీనిని అధిగమించేందుకు 8 సంవత్సరాల సమయం పడుతుందని వివరించారు. నాలుగేళ్లలో సాధించిన అభివృద్ధిని ప్రజలకు అంకితం చేద్దామని, ప్రజలు, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడి ఫలితాలు సాధించారన్నారు. ఈ సారి కూడా విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్దే నవ నిర్మాణ దీక్ష నిర్వహించేందుకు నిర్ణయించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి జూన్ 8 నాటికి 4 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటుకు ప్రతిపాదించారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయమే ప్రధానంగా ఈ సభను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నవ నిర్మాణ దీక్ష, మహా సంకల్పం కార్యక్రమాలను ఖరారు చేశారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాలో ముఖ్యమంత్రి సమక్షంలో కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకూ గ్రామ సభల నిర్వహణ ఉంటుంది. జూన్ 2వ తేదీన నవ నిర్మాణ దీక్షా సమయంలోనే విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి ప్రజలతో సీఎం ప్రతిజ్ఞ చేయిస్తారు. 12 వేల గ్రామాల్లో ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
జూన్ 2: నవ నిర్మాణ దీక్ష ( విభజన చట్టం, అమలు తీరు)
జూన్ 3: నీటి భద్రత - కరవు రహిత రాష్ట్రం (తాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు నీరు, పోలవరం, ప్రాధాన్య ప్రాజెక్టులు, జలవనరులు)
జూన్ 4: రైతు సంక్షేమం - ఆహార భద్రత ( వ్యవసాయ, అనుబంధ రంగాలు, పౌరసరఫరాలు)
జూన్ 5: సంక్షేమం - సాధికారత ( వైద్యరోగ్యం, మహిళా, శిశు సంక్షేమం, సమాజ వికాసం, కుటుంబ వికాసం)
జూన్ 6: ఉపాధి కల్పన - జ్ఞాన భూమి ( పారిశ్రామికం, సేవా రంగం, మానవ వనరులు, విద్య, నైపుణ్యాభివృద్ధి)
జూన్ 7: వౌలిక సదుపాయాలు - మెరుగైన జీవనం ( అమరావతి, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి)
జూన్ 8: మహా సంకల్పం ( సుపరిపాలన, అవినీతి రహిత పాలన, గ్రామ, రాష్ట్ర స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక, ఇ-ప్రగతి, ఐటి, ఐవోటీ, పౌర సేవలు, సుస్థిర అభివృద్ధి, విజన్)
ఒక్కొక రోజు ఒక్కో అంశంపై వేడుకలు ( ఓఫీఎఫ్, ఓడీఎఫ్ ప్లస్, సిమెంట్ రోడ్లు, పంట కుంటలు, ఫైబర్ గ్రిడ్, వర్చువల్ క్లాస్ రూమ్స్, అర్బన్, రూరల్ హౌసింగ్, అంగన్‌వాడీ భవనాలు)
రానున్న రెండు, మూడు సంవత్సరాల్లో గ్రామీణ వౌలిక సదుపాయాలు, నీటి భద్రత, ఫైబర్ గ్రిడ్‌కు సంబంధించి లక్ష్యాలు వివరిస్తారు.