రాష్ట్రీయం

బదిలీలపై నిషేధం ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్ధిక శాఖ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు ఉద్యోగుల సాధారణ బదిలీల షెడ్యూలును కూడా విడుదల చేసింది. ఆన్‌లైన్ కౌనె్సలింగ్ ద్వారా మే 25 నుండి జూన్ 15 మధ్య ఉద్యోగుల సాధారణ బదిలీలు జరుగుతాయి. జూన్ 16 నుండి సాధారణ బదిలీలపై మళ్లీ నిషేధం అములోకి వస్తుంది. బదిలీల శాతాన్ని 40కు పెంచారు.
బదిలీల ఉత్తర్వుల్లో ముఖ్యాంశాలు
ఒకే చోట రెండేళ్ల కంటే ఎక్కువ పనిచేసిన వారి బదిలీలకు అవకాశం
ఒకే చోట కనీసం ఐదేళ్లు పనిచేసిన వారికి ఖచ్చితంగా బదిలీ
మే 31 వరకూ రెండేళ్లు పూర్తయితే బదిలీకి అర్హత
ఒకటి కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే లాటరీ ద్వారా బదిలీలు
ఆరు రకాల అనారోగ్య కారణాలకు బదిలీల్లో ప్రాధాన్యత
వచ్చే ఏడాదిలోగా రిటైరయ్యే వారికి బదిలీలు వర్తించవు
వచ్చే ఏడాదిలోగా రిటైరయ్యేవారు ప్రత్యేకంగా కోరితే బదిలీ
భార్యాభర్తలు కేటగిరి కింద బదిలీలకు అవకాశం
70 శాతానికి పైగా దివ్యాంగులైన వారికి ప్రత్యేక ప్రాధాన్యత
వితంతువులకు ప్రత్యేక ప్రాధాన్యత
మానసిక వికలాంగులైన
పిల్లల తల్లిదండ్రులకు ప్రాధాన్యత
కారుణ్యనియామకాల్లో నియమితులైన వారికీ ప్రాధాన్యత
తీవ్ర అనారోగ్య సమస్యలున్న వారికీ బదిలీల్లో ప్రాధాన్యత
దీర్ఘకాలం మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు ప్రాధాన్యత
విద్య వాణిజ్య పన్నుల శాఖల్లో బదిలీలకు విడిగా మార్గదర్శకాలు
స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీలకు విడిగా మార్గదర్శకాలు
పోలీసు అబ్కారీ శాఖల్లో బదిలీలకు విడిగా మార్గదర్శకాలు
రవాణా, అటవీ శాఖలో బదిలీలకు విడిగా మార్గదర్శకాలు
మే 25 నుండి 31 వరకూ నిర్వహణ మార్గదర్శకాల రూపకల్పన
జూన్ 1 నుండి 5 వరకూ దరఖాస్తుల సమర్పణ
జూన్ 6 నుండి దరఖాస్తుల పరిశీలన
జూన్ 13 నుండి బదిలీల ఉత్తర్వులు, రిలీవ్ కావడం , కొత్త స్థానాల్లో రిపోర్టు చేయడం
జూన్ 15 బదిలీల ప్రక్రియ పరిసమాప్తం