రాష్ట్రీయం

ట్రస్టులకు ఆస్తిపన్ను మినహాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: పేద ప్రజలకు సేవలు అందిస్తున్న ట్రస్టులకు ఆస్తి పన్ను నుంచి మినహాయించబోతున్నట్టు మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. త్వరలోనే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు చెప్పారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్‌లో లుకేమియా చికిత్సలో కీలకమైన అత్యాధునిక బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ విభాగాన్ని మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బసవతారకం వంటి స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ, సహకారాలను అందజేస్తుందన్నారు. ప్రభుత్వాలు మారినా ఇలాంటి సంస్థలకు ఇబ్బంది కలుగకుండా మున్సిపల్ పన్ను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబోతుందన్నారు.
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పక్కనే్న తమ ఇల్లు ఉండటంతో ఇక్కడ రోగుల కుటుంబ సభ్యులు పడే తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. రోగుల కుటుంబ సభ్యులు రాత్రి వేళలో బస చేయడానికి ప్రభుత్వపరంగా నైట్ షెల్టర్లను ఏర్పాటు చేసామన్నారు. ఇంకా అవసరమైతే మరికొన్ని షెల్టర్లను ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. దివంగత ఎన్టీఆర్ పేరు తనకు పెట్టడం వల్ల అంతటి మహనీయుడి పేరుకు కళంకం తీసుకొచ్చేలా ఎప్పుడు ప్రవర్తించకుండా, మరింత గర్వపడే విధంగా ప్రవర్తిస్తున్నాని అన్నారు.

చిత్రం..బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో బాలకృష్ణ, కేటీఆర్