రాష్ట్రీయం

జే హబ్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: నవకల్పనలకు, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ పరిష్కారాల అభివృద్ధికి, పారిశ్రామిక ప్రవర్థమానానికి, పారిశ్రామిక ఔత్సాహికతను ప్రోత్సహించేందుకు జెఎన్‌టియు జెహబ్‌ను ప్రారంభించింది. ఈ మేరకు జెఎన్‌టియు హైదరాబాద్, హైసియా మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ వేణుగోపాల్‌రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్ యాదయ్య, హైసియా అధ్యక్షుడు మురళీ బొల్లు అవగాహన ఒప్పందంపై గురువారం నాడు సంతకాలు చేశారు. జెహబ్ ప్రొఫెసర్ జి విజయకుమారి, ఇన్‌సైడ్ వ్యూ టెక్నాలజీస్ ఎండి శేష ఎం రావు, హైసియా సీఓఓ ఆర్ శ్రీనివాసరావు, కో ఇనె్వన్షన్ ప్రొఫెసర్ రమేష్ లోగనాధన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ పరిశ్రమకు, విద్యాసంస్థలకు మధ్య సమన్వయానికి, పరస్పర అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ అవగాహన ఒప్పందం ఎంతో దోహదం చేస్తుందని అన్నారు. పరిశ్రమ లక్ష్యం, విద్యాసంస్థల లక్ష్యం ఒక్కటే మంచి నిపుణులను తయారుచేయడం ఈ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ఈ ఒప్పందం ఒక వేదిక అవుతుందని ఆయన చెప్పారు. విద్యార్థులు తమ పరిశోథనలను కొనసాగించేందుకు పరిశ్రమ తోడ్పాడు ఉంటుందని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మురళి బొల్లు మాట్లాడుతూ ఇప్పటికే హైసియా, జెఎన్‌టియుహెచ్‌ల మధ్య పరస్పర అవగాహన ఉందని, జెఎన్‌టియు ఎక్జైట్ ప్రోగ్రాం ద్వారా కలిసి పనిచేస్తున్నామని, ఇపుడు విజ్ఞాన భాగస్వామ్యంలో అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఈసెట్ ఫలితాల విడుదల
అనంతరం జరిగిన మరో కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి ఈసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ వేణుగోపాల్‌రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్ యాదయ్య, కన్వీనర్ డాక్టర్ ఎ గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫలితాల సీడీని విడుదల చేశారు. ఇంజనీరింగ్ స్ట్రీం, ఫార్మసీ స్ట్రీం, బిఎస్సీ మాథ్స్ స్ట్రీం ఫలితాలను విడుదల చేశారు. వీరంతా నేరుగా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో చేరేందుకు వీలుకల్పించనున్నారు. మొత్తం 27,657 మంది రిజిస్టర్ చేసుకోగా, 97.20 శాతం మంది హాజరయ్యారు. హాజరైన వారిలో 92.05 శాతం మంది అర్హత సాధించారని కన్వీనర్ చెప్పారు.

చిత్రం..జే హబ్ ఏర్పాటు అవగాహన ఒప్పందం చేసుకుంటున్న దృశ్యం