రాష్ట్రీయం

30, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా జాతీయ, ప్రైవేటు బ్యాంకుల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 24: నాలుగు ప్రధాన డిమాండ్లపై ఈ నెల 30, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా జాతీయ, ప్రైవేట్, విదేశీ బ్యాంకుల్లో పనిచేస్తున్న 10 లక్షల మంది అధికారులు, ఉద్యోగులు 48 గంటల సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. ప్రధానంగా 2017 అక్టోబర్ 31వ తేదీతో అంతమైన పదవ వేతన ఒప్పంద స్థానంలో కొత్త ఒప్పందం, సముచితమైన వేతనం పెంపుదల, అధికారుల్లో అన్ని స్థాయిల వారికి వేతన ఒప్పందం అమలుతో పాటు బ్యాంకు యాజమాన్యం ప్రతిపాదిస్తున్న రెండు శాతం వేతన పెరుగుదలను నిరసిస్తూ వీరు ఈ ఆందోళనకు పూనుకున్నారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ నేతలు మాట్లాడారు. ఐదేళ్లకోసారి వేతన పెరుగుదల జరగాల్సి ఉందని, కొత్త ఒప్పందాన్ని జాప్యం చేస్తూనే బ్యాంకుల ఆర్థిక పరిస్థితి బాగుండలేనందున రెండు శాతం కంటే పెంపుదల సాధ్యం కాదని చెప్పటం దారుణమన్నారు. షాపుల్లో పనిచేసే గుమాస్తాలకు ఏటా పెరిగేంతటి వ్యత్యాసం కూడా లేకపోవటం సిగ్గుచేటన్నారు. జాతీయ బ్యాంకులు 2013-14లో లక్షా 27 వేల 653 కోట్ల స్థూల లాభాన్ని ఆర్జించగా, 2016-17కి అది లక్షా 58 వేల 952 కోట్లకు పెరిగిందన్నారు. అయితే ఈ లాభాల నుంచి రాని బాకీల నిధికి లక్షా 70 వేల 330 కోట్లు మళ్లించి నష్టాలు వస్తున్నాయనే సాకు చూపడం సరికాదన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇటీవల వ్యాపారి నీరవ్ మోదీ ఘనకార్యంతోరూ.1351 కోట్ల లాభాల నుంచి 14 వేల కోట్ల నష్టానికి వెళ్లిందన్నారు. ఇక బ్యాంకు వెచ్చించే ఖర్చులతో ఉద్యోగుల వేతన శాతం ఏటేటా తగ్గిపోతున్నదంటూ 2012 మార్చి మాసాంతానికి 13.72 శాతం ఉండగా అది 2016 మార్చి మాసాంతానికి 10.8 శాతానికి పడిపోయిందంటే బ్యాంకు ఉద్యోగుల జీతాలు ఏ విధంగా క్షీణిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇక ప్రైవేట్ బ్యాంకుల్లో విదేశీ షేర్లున్నా అందులోని డిపాజిట్ సొమ్ము ఇక్కడి ప్రజలదేనంటూ ఎన్‌పిఏలలో అత్యధికంగా ఐసీఐసీఐలో రూ.54063 కోట్లు, యాక్సిస్ రూ.34,244 కోట్లు, ఇలా మొత్తం 10 బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల విలువ లక్షా 10 వేల కోట్లు ఉందంటూ ప్రజల సొమ్ముకు భద్రత కోసం తక్షణం వాటిని కూడా జాతీయం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వై.శ్రీనివాసరావు (ఎఐబీఈఏ), వీఆర్‌కె మోహన్ (ఏఐబీయూసి), పీసీ ప్రకాష్ (ఎన్‌సీబీఈ), పీవీ రామకృష్ణ (ఏఐబీఓఏ), ఆర్.అజయ్‌కుమార్ (బీఈఎఫ్‌ఐ), టీవీవీ సూర్యనారాయణ, ఎంవీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.