రాష్ట్రీయం

నేటి నుంచి టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్లు జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మరింత పారదర్శకంగా సేవలందించే క్రమంలో భాగంగా నూతనంగా ఏర్పాటుచేసిన సమయ నిర్దేశిత సర్వదర్శనం(టైంస్లాట్) కౌంటర్లలో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తిరుమల, తిరుపతిలలో నిర్ణీత సంఖ్యలో టోకెన్లు జారీ చేయనున్నట్లు తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. గురువారం ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా నిర్దేశిత సమయంలో స్వామివారి దర్శనం కల్పించేందుకు ఈ నెల 3వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం నుంచి తిరుమలలో సర్వదర్శనం కౌంటర్లను తాత్కాలికంగా మూసివేసినట్లు వివరించారు. శని, ఆదివారాలలో 30వేల టోకెన్లు, సోమ, శుక్రవారాలలో 20వేల టోకెన్లు, మంగళ, బుధ, గురు వారాలలో 17వేల టోకెన్లు జారీ చేయనున్నట్లు చెప్పారు. సర్వదర్శనం టోకెన్లు పొందని భక్తులు ప్రస్తుతం లేపాక్షి సర్కిల్ నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్‌లో ప్రవేశించి కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకోవచ్చునన్నారు. సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందే భక్తులు ఆధార్‌కార్డు లేదా ఓటర్‌కార్డును తీసుకురావాలని జేఈఓ కోరారు.