జాతీయ వార్తలు

విశ్వాసం.. విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 25: కర్నాటక అధికార పీఠానికి నిలయమైన విధానసౌధలో శుక్రవారం రెండు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపి చివరి నిమిషంలో వ్యూహం మార్చడంతో విశ్వాసపరీక్షలో జేడీ(ఎస్)-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం మూజువాణి ఓటుతో గెలిచింది. విశ్వాస పరీక్ష మరికొన్ని నిమిషాల్లో జరుగుతుందనంగా అసెంబ్లీలో 104మంది సభ్యులతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపి వాకౌట్ చేసింది. దీంతో సభలోని 78మంది కాంగ్రెస్ సభ్యులు, 37 మంది జేడీ(ఎస్), ఇద్దరు బీఎస్పీ సభ్యులు కుమారస్వామి ప్రభుత్వానికి మూజువాణి ఓటుతో మద్దతు తెలిపారు. దీంతో కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్షను నెగ్గినట్లు స్పీకర్ రమేష్‌కుమార్ ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా గత 10 రోజులుగా అడుగడుగునా ఉత్కంఠ కలిగించిన కర్నాటక రాజకీయ గందరగోళానికి తెరపడింది. అంతకు ముందు స్పీకర్ పదవికి ఎన్నిక ఏకగ్రీవమైంది. స్పీకర్ పదవికి పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసిన బీజేపి అభ్యర్థి సురేష్‌కుమార్ పోటీ నుంచి వైదొలిగారు. బీజేపి అగ్రనాయకత్వం ఆదేశం మేరకు సురేష్ కుమార్ నామినేషన్ పత్రాన్ని ఉపసంహరించుకున్నారు. దీంతో జేడీ(ఎస్)-కాంగ్రెస్ తరఫున స్పీకర్ పదవికి రంగంలో ఉన్న ఎకైక అభ్యర్థి రమేష్‌కుమార్ ఎన్నిక ఏకగ్రీవమైంది.
విశ్వాసపరీక్ష సందర్భంగా ఆసక్తికరమైన పరిణామాలు శుక్రవారం కర్నాటక అసెంబ్లీలో చోటు చేసుకున్నాయి. తొలుత ఏకగ్రీవంగా ఎన్నికైన స్పీకర్ రమేష్‌కుమార్‌ను ముఖ్యమంత్రి కుమారస్వామి, ప్రతిపక్షనేత బిఎస్ యెడ్యూరప్ప దగ్గరుండి స్పీకర్ స్థానం వరకు మర్యాదగా తోడ్కొని వెళ్లారు. ఆ సందర్భంగా సీఎం కుమారస్వామి, ప్రతిపక్షనేత బిఎస్ యెడ్యూరప్ప స్పీకర్ స్థానంకు ఉన్న గౌరవంపై గంభీరమైన ప్రసంగాలు చేశారు. అనంతరం విశ్వాస పరీక్ష జరిగింది. విశ్వాస పరీక్షకు ముందు సీఎం కుమారస్వామి, ప్రతిపక్ష నేత యెడ్యూరప్ప ప్రసంగాల సందర్భంగా సభలో నిశ్శబ్ధం నెలకొంది. అధికార, విపక్ష పార్టీ సభ్యులు తమ స్థానాల్లో శాంతియుతంగా కూర్చుని ప్రసంగాలను సావధానంగా వినడం కనిపించింది. స్పీకర్ ఎన్నిక, విశ్వాస పరీక్ష సందర్భంగా కర్నాటక అసెంబ్లీలో అధికార, విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రదర్శించిన సంయమనం, రాజనీతి, హుందాతనం దేశంలో ఇతర అసెంబ్లీలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పాలి.
ఐదేళ్లపాటు సుస్థిరపాలన: కుమారస్వామి
విశ్వాసపరీక్ష సందర్భంగా సీఎం కుమారస్వామి మాట్లాడుతూ ప్రజలు మా పార్టీకి కూడా మెజార్టీ ఇవ్వలేదనే బాధ ఉంది. కాంగ్రెస్ మద్దతుతో ఐదేళ్లపాటు సుస్థిరమైన పాలన అందిస్తామనే నమ్మకం ఉందని చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాలకు తావివ్వకుండా, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సంకీర్ణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అధికారం కోసం వెంపర్లాడే తత్వం మా కుటుంబంలో లేదన్నారు. ‘నా జీవితంలో ఎక్కువ కాలం ప్రతిపక్ష స్థానంలోనే గడిపాను’ అని ఆయన చెప్పారు. 2006లో బీజేపితో చేతులు కలపడం వల్ల నా తండ్రి, పూర్వ ప్రధాని దేవెగౌడ రాజకీయ జీవితంపై మచ్చ ఏర్పడింది. ఇప్పుడు సెక్యులర్ పార్టీతో పొత్తుతో ఆయనపై ఏర్పడిన మచ్చ తొలగింది అని కుమారస్వామి అన్నారు. వీలైనంత తొందరలో రైతుల రుణమాఫీకి చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రంలో బీజేపి సర్కార్ దర్యాప్తు ఏజన్సీలను ఉపయోగించుకుని ఎమ్మెల్యేలను బెదిరించి లొంగదీసుకోవాలని ప్రయత్నించిందన్నారు. తనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేసిన అభియోగాలు తప్పని రుజువుచేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. కుమారస్వామి ప్రసంగం ముగిసిన తర్వాత ప్రతిపక్ష నేత యెడ్యూరప్ప ఉద్వేగభరితంగా మాట్లాడి సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
స్పీకర్ ఎన్నికపై ఉత్కంఠ
స్పీకర్ ఎన్నిక సందర్భంగా ఉత్కంఠ ఏర్పడింది. సభను ప్రొటెం స్పీకర్ కెజి బొపయ్య సమావేశపరిచిన వెంటనే, బీజేపి ఎమ్మెల్యే సునీల్ కుమార్ లేచి తమ పార్టీ తరఫున సురేష్ కుమార్ అభ్యర్థిత్వాన్ని స్పీకర్ పదవికి ప్రతిపాదించడం లేదన్నారు. వెంటనే సురేష్ కుమార్ లేచి, ఈ ప్రతిపాదనకు సమ్మతి తెలియచేశారు. అనంతరం పూర్వ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లేచి స్పీకర్ పదవికి కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ కుమార్ పేరును ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ఉపముఖ్యమంత్రి పరమేశ్వరప్ప బలపరిచారు. అనంతరం ఈ ప్రతిపాదనను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.