రాష్ట్రీయం

స్థానికులకు 85..ఇతరులకు 15 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: ప్రభుత్వ యంత్రాంగంలో జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థలను ఖరారు చేసిన ప్రభుత్వం, స్థానిక, స్థానికేతరులకు రిజర్వేషన్ల కోటాపై కూడా కసరత్తు చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా కేడర్ నియామకాల్లో స్థానికులకు 80 శాతం, స్థానికేతరులకు 20 శాతం రిజర్వేషన్లు, జోనల్ కేడర్‌లో 70/30 శాతం రిజర్వేషన్లు అమలు జరిగాయి. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక స్థానికులకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు దక్కే విధంగా జిల్లా కేడర్‌లో ఇక నుంచి స్థానికులకు 85 శాతం, స్థానికేతరులకు 15 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారుల,
సిబ్బంది, పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతిపాదించింది. జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థలో చేర్పులు, మార్పులపై జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి ప్రభుత్వం అభిప్రాయాలను కోరగా జిల్లా కేడర్ పోస్టుల్లో 85/15 శాతం రిజర్వేషన్ల కోటాను ప్రతిపాదించింది.