రాష్ట్రీయం

ప్రతీ రైతుకు 5 లక్షల బీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: రాష్ట్రంలో రైతులందరికీ వర్తించేలా రూ. 5 లక్షల జీవిత బీమా పథకాన్ని ప్రవేశ పెట్టనున్నట్టు సీఎం కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆగస్టు 15న పథకాన్ని ప్రారంభించి రైతులందరికీ బీమా పత్రాలు అందిస్తామని ప్రకటిం చారు. రైతు జీవిత బీమా పథకం విధి విధానాలను ఈ సందర్భంగా ప్రకటించారు. ఆదివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో రైతు బీమా పథకంపై చర్చించి ఆమోదించనున్నట్టు వెల్లడించారు. రైతుల తరఫున బీమా ప్రీమియానికి అవసరమయ్యే నిధులను ప్రతీ ఏటా బడ్జెట్‌లోనే కేటాయించనున్నట్టు తెలిపారు. 18నుంచి 59 ఏళ్లలోపు వయసు కలిగిన రైతులకు వర్తిస్తుందన్నారు. రైతు ఏకారణంతో చనిపోయినా, సహజ మరణమైనా ఈ బీమా పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ప్రగతి భవన్‌లో శుక్రవారం మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించిన అనంతరం విధివిధానాలను ఖరారు చేశారు. దేశ చరిత్రలో మరెక్కడా, ఏ రాష్ట్రంలో ఇలాంటి రైతు జీవిత బీమా పథకం లేదని సీఎం అన్నారు. ఇప్పటికే ఎకరాకు 8 వేల పంట పెట్టుబడి, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరావంటి అద్వితీయమైన పథకాలు ప్రవేశ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టబోతుందన్నారు.
రైతు బీమా పథకం విధి విధానాలు...
* బీమా సంస్థల నిబంధనల ప్రకారం జీవిత బీమా కేవలం 18 నుంచి 60 ఏళ్ల వయసున్న వారికే వర్తిస్తుంది. ఈ నిబంధనల ప్రకారం 18నుంచి 59 ఏళ్ల వయసు కలిగిన రైతులకు బీమా పథకం వర్తిస్తుంది.
* ఆధార్ కార్డుపై నమోదైన రైతు పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. 2018 ఆగస్టు 15 నాటికి 18 నుంచి 59 ఏళ్ల వయసు కలిగిన వారితో ప్రభుత్వం జాబితాను రూపొందిస్తుంది.
* ప్రతీ రైతుకు ప్రభుత్వం-ఎల్‌ఐసి సంయుక్తంగా బీమా పత్రాన్ని అందిస్తుంది.
* రైతు మరణిస్తే బీమా సొమ్ము రూ. 5 లక్షలు ఎవరికి చెల్లించాలో నామినీ పేరును ప్రతిపాదించే అధికారం సదరు రైతుకే ఉంటుంది.
* రైతు మరణించిన 10 రోజుల్లో నామినీకి రూ. 5 లక్షలు చెల్లించే విధంగా ప్రభుత్వం ఎల్‌ఐసితో ఒప్పందం చేసుకుంటుంది. గడువులోగా బీమా సొమ్ము చెల్లించని పక్షంలో ఎల్‌ఐసికి ప్రభుత్వం జరిమానా విధిస్తుంది.
* రైతుల తరఫున ప్రభుత్వమే ఎల్‌ఐసికి ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తుంది. ప్రతీ ఏడాది బడ్జెట్‌లో దీనికి నిధులు కేటాయిస్తుంది.
* నెలనెలా రైతుల వివరాలను వ్యవసాయ అధికారులు అప్‌డేట్ చేస్తారు. కొత్తగా భూమి కొనుగోలు చేస్తే అప్పటి నుంచి బీమా వర్తిస్తుంది.
* వ్యవసాయ అధికారులు కస్టర్ల వారీగా రైతుల జాబితాలను తయారు చేసి ఎల్‌ఐసికి అందజేస్తే దాని ప్రకారం బీమా పత్రాలను ముద్రించి అందజేస్తుంది.