రాష్ట్రీయం

అదిగో నిఫా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: కేరళలో పదిమంది ప్రాణాలు తీసిన నిఫా వైరస్ (అతి సూక్ష్మక్రిమి) రాజధానిలోకి చొరబడిందంటూ సోషల్ మీడియా చేసిన ప్రచారంతో 24 గంటలపాటు రాజధాని అల్లాడిపోయింది. గంటల్లోనే ప్రచారం విస్తృతం కావడంతో మహానగరంలోకి ఆస్పత్రులన్నీ అలర్టయ్యాయి. ప్రభుత్వం ఒకవిధంగా హైఅలర్ట్ ప్రకటించింది. నిఫా అనుమానంతో ఫీవర్ ఆస్పత్రికి ఇద్దరు రోగులు రావడంతో, సోషల్ మీడియాలో సాగిన ప్రచారానికి ఊతంవచ్చింది. ఆగమేఘాల మీద ఇద్దరి రక్తనమూనాలు పూణెకు తరలించారు. అయితే రక్తనమూనాల్లో నిఫా జాడలేదంటూ నివేదిక రావడంతో పనె్నండు గంటలపాటు సాగిన భయానక ప్రచారం కొద్దిగా సద్దుమణిగింది. అయినా, నిఫా అనుమానాలు రాజధానివాసులను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అయితే, ప్రస్తుతాని నిఫా ప్రమాదం లేకున్నా, వలస కూలీల కారణంగా ఆ పరిస్థితి తలెత్తే ప్రమాదం లేకపోలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వలస కూలీలు ఒకింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదిలావుంటే, ప్రాణాంతక నిఫా
వైరస్ (అతిసూక్ష్మక్రిమి) వ్యాధి లక్షణాలు కనిపించినవారి రక్త నమూనాల్లో నెగెటివ్ వచ్చిందని పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ రమేష్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే నిఫాపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. నిఫా రాజధానికి చేరినట్టు శుక్రవారం సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం సాగడంతో జనం భయాందోళనకు గురయ్యారు. దీంతో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. జంట నగరాల్లోని ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలకు సిద్ధంగా ఉండాలని సూచించింది. మరోపక్క వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు నిఫా వైరస్‌పై శుక్రవారం సచివాలయంలో సమీక్షించారు. నిఫా వదంతులు నమ్మొద్దని, లక్షణాలు కనిపిస్తే స్థానిక వైద్యాధికారులను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. ముఖ్యంగా కేరళకు కూలికి వెళ్ళి తిరిగి హైదరాబాద్‌కు వస్తున్న వలస కూలీలపై నిఘా ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు. మహబూబ్‌నగర్ (పాలమూరు)కు సంబంధించిన వలస కూలీలు ఆస్పత్రులకు వచ్చిన సమయంలో సమాచార సేకరణతో అప్రమతంగా ఉండాలని అధికారులు సూచించారు. శుక్రవారం హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రి, నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగుల్లో లక్షణాలు కనిపించటంతో రక్త నమూనాలను పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి)కి పంపించారు. అయితే, నివేదికలో నిఫా నెగెటివ్ వచ్చిందని తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ కె రమేష్‌రెడ్డి వెల్లడించారు. నిఫా వైరస్ సోకితే రోగికి విపరీతమైన జ్వరం, తలనొప్పి, మైకం రావడం, చమటలు పట్టడం, నోటిలో తేమ లేకపోడం వంటి లక్షణాలు కన్పిస్తాయన్నారు. నిఫాకు చికిత్స లేదని, నివారణకు అవగాహన ముఖ్యమన్నారు.