రాష్ట్రీయం

సిద్దిపేట మున్సిపాల్టీకి జాతీయ స్థాయిలో అవార్డుల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మే 25: అభివృద్ధి.. సంక్షేమ పథకాల అమలులో ఆదర్శంగా నిలుస్తున్న జిల్లా కేంద్రమైన సిద్దిపేట స్పెషల్ గ్రెడ్ మున్సిపాల్టీకి మరో అరుదైన గౌరవం దక్కింది. అభివృద్ధికి చిరునామాగా నిలుస్తున్న సిద్దిపేట మున్సిపాల్టీ జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండింది. గడిచిన ఐదునెలల్లో సిద్దిపేట మున్సిపాల్టీ మూడవ సారీ జాతీయ స్థాయి అవార్డులు సొంతం చేసుకుంది. మే 16న దక్షిణ భారతదేశంలో క్లీన్ సిటీగా అవార్డు సొంతం చేసుకుంది. స్వచ్ఛ ఎక్స్‌లెన్స్ అవార్డును జాతీయ స్థాయిలో కేంద్ర అర్బన్ మంత్రిత్వ శాఖ నుండి గత మార్చి 23న సొంతం చేసుకుంది. ఘన, ద్రవ వ్యర్థ పదార్థాల వినియోగంలో జాతీయ స్థాయిలో డిసెంబర్ 28, 2017న అవార్డు సొంతం చేసుకుంది. ఇవేగాక పలు అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న సిద్దిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీ 2018 స్కాచ్‌లో జాతీయ స్థాయిలో 6 విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకొని మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. స్కాచ్-2018 52 సమ్మెళనానికి సిద్దిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీలో పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిపై ఆరు విభాగాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. సుస్థిరమైన పట్టణం - సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు ప్రజలకు జీవనోపాధి విభాగం ద్వారా ప్రజలకు ఇంటి వద్దనే సేవలు అందించటం. స్థిరమైన అమృత్ పట్టణ నగరికరణ, స్థిరమైన పర్యావరణ పరిరక్షణ సమతుల్యత పాటించడం, అంతర్జాల పరిజ్ఞానాన్ని ఉపయోగించి సుస్థిర సేవలు, పరిపాలన అందించుట, పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దుట, స్వచ్ఛ్భారత్ మిషన్ పటిష్టంగా అమలు చేయుట, సమర్థవంతమైన పాలన-సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుట 6-కేటగిరిలో దరఖాస్తు చేసుకున్నారు. నామినేషన్లు పరిశీలించిన ఆనంతరం స్కాచ్ -2018 52వ సమ్మెళనం పిలుపుమేరకు ఈనెల 9న ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు. నామినేషన్లు దాఖలు, ప్రజలకు సత్వరమే సేవలు అందించుట, జ్యూరీ మూల్యాంకణం, ఓటింగ్‌లో అత్యంత జనాదరణ పొందిన పట్టణంగా పరిశీలించి సిద్దిపేట మున్సిపాల్టీలో 6 కేటగిరిల్లో జాతీయ స్థాయిలో 6 అవార్డులను సొంతం చేసుకొని ప్రత్యేకతను చాటుకుంది. జూన్ 21న సిద్దిపేట స్పెషల్ మున్సిపాల్టీకి 2018 స్కాచ్ అవార్డులను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సులు అందుకోనున్నారు.
అవార్డు స్ఫూర్తిగా మరిన్ని సేవలు
- మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీకి 2018 స్కాచ్ విభాగంలో జాతీయ స్థాయిలో ఆరు కేటగిరీల్లో అవార్డులు సొంతం చేసుకోవటం పట్ల రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో అవార్డులను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు మరింత సేవలు అందిస్తామన్నారు. సిద్దిపేట మున్సిపాల్టీని దేశంలో ఆదర్శంగా నిలిపేందుకు కృషిచేస్తామన్నారు.