రాష్ట్రీయం

బాబువన్నీ పగటి కలలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, మే 25: తెలంగాణలో కర్నాటక తరహా ఎన్నికల ఫలితాలు వస్తాయని, ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నిర్ణయాత్మకశక్తిగా మారుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు పగటి కలలు కంటున్నారని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ టీడీపీ మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో టీడీపీ సైకిల్ రెండు చక్రాలు ఎప్పుడో ఊడిపోయాయని, ప్రస్తుతం ఆంధ్రాలో అధికారంలో ఉన్నప్పటికీ ఒక చక్రం ఊడిపోయేలా ఉందని, అందువల్ల కర్నాటక ఫలితాలు ఆంధ్రాలోనే పునరావృతం అవుతాయని చమత్కరించారు. తెలంగాణలో పచ్చ పార్టీ ఏనాడో అంతరించి పోయిందని, ఒక్కరిద్దరు నేతలు ఉండి హడావుడి చేసినంత మాత్రన అద్భుతాలు జరగవన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నిర్ణయాత్మక శక్తిగా మారుతుందంటున్న చంద్రబాబు తెలంగాణలో ఎక్కడ పోటీచేసినా ఆ పార్టీకి డిపాజిట్ సైతం దక్కదన్న విషయాన్ని గమనించాలన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగేళ్లలోనే ఎంతో అభివృద్ధి చేస్తూ వినూత్న ప్రజారంజక పథకాలను అమలుచేస్తూ సీఎం కేసీఆర్ నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని, ఈ తరుణంలో టీఆర్‌ఎస్‌ను జాతీయపార్టీగా మార్చితే ఆంధ్రప్రదేశ్‌లోనూ క్లీన్‌స్వీప్ చేస్తుందన్నారు. హైదరాబాద్ నగరాన్ని తానే నిర్మించినట్లుగా బాబు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. హైదరాబాద్‌ను నిర్మించిన నిజాం నవాబు సైతం ఎప్పుడూ ఈ విధంగా చెప్పుకున్నట్లుగా అనిపించడం లేదన్నారు. నాలుగు భవనాలు నిర్మించి రాజధానిని తానే నిర్మించానని చెప్పుకోవడం బాబు అవివేకానికి నిదర్శనమన్నారు. నిన్నటి మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ చందంగా ఉన్నాయన్నారు.