రాష్ట్రీయం

రైతులను మభ్యపెట్టొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, మే 25: సబ్సిడీ పథకాలతో రైతులను మభ్యపెట్టకుండా, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కరీంనగర్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూర్చే పేరుతో ఆర్థికంగా ఉన్నవారి కోసమే పథకం ప్రవేశపెట్టారని ఆరోపించారు. వాస్తవ సాగుదారులను వీడి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, సాగు తెలియని పట్ట్టాదారులకు సాయం చేయటం వెనుక గల రాజకీయ ఉద్దేశం స్పష్టమవుతోందన్నారు. కొండలు, గుట్టలకు కూడా పథకాన్ని వర్తింపజేయటం ఏమేరకు సమంజసమని ప్రశ్నించారు. భూ ప్రక్షాళన పేర గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది అవినీతి, అక్రమాలు పెచ్చుమీరుతున్నాయని మండిపడ్డారు. కొత్త పాసుబుక్కుల్లో అనేక అవకతవకలు చోటుచేసుకున్నా పట్టించుకునే నాథుడే లేడని దుయ్యబట్టారు. పేద రైతుల పట్టాలు మార్చేందుకే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం చేపట్టాడని ధ్వజమెత్తారు. మరో వందేళ్లు తపస్సు చేసినా ప్రక్షాళన జరగదని తేల్చి చెప్పారు. అత్యధిక మంది రైతుల భూములు పాసుబుక్కుల్లో నమోదు చేయలేదని, ఉన్నవి లేనట్లు.. లేనివి ఉన్నట్లుగా ముద్రించి రైతులను అయోమయానికి గురిచేస్తున్న తీరు విస్మయం కల్గిస్తోందన్నారు. తన పేర ఉన్న భూమి కన్నా అదనంగా నమోదు చేసి, పాసుబుక్కులు అందజేసినట్లు ఆయన వెల్లడించారు. రైతు రుణాల వడ్డీ చెల్లించకుండా రుణమాఫీ చేసినట్లు చెప్పుకోవటం సిగ్గుచేటని విమర్శించారు. వడ్డీమాఫీ చేస్తున్నట్లు సీఎం కేసీ ఆర్ పదే పదే ప్రకటనలు చేసినా, గ్రామాల్లో రైతాంగానికి మాత్రం ఇప్పటికీ బ్యాంకర్లు నోటీసులు జారీ చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రూ.4వేలతో తన బుట్టలో వేసుకునేందుకు వేస్తున్న రాజకీయ పాచికకు రైతులు లొంగబోరని అన్నారు. రైతు సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే రైతుల ఆత్మహత్యలు ఎందుకు కొనసాగుతున్నాయో తెలపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 31న ఖమ్మం నుంచి కరీంనగర్ వరకు అన్ని ప్రధాన రహదారులపై వంట, వార్పు కార్యక్రమం తలపెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం అమరులైన ఆత్మలు క్షోభిస్తున్నాయని, జూన్ 2న అమర వీరుల ఆకాంక్ష దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పాటించాలని పిలుపునిచ్చారు.