రాష్ట్రీయం

ఆర్టీసీలో చార్జీల భారం ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పెరిగిన డీజిల్ ధరలు నష్టాలకు గురిచేస్తున్నప్పటికీ ఆ భారాన్ని ప్రయాణికులపై వేయబోమని ఆర్టీసీ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ (ఎండీ) ఎన్‌వి సురేంద్రబాబు స్పష్టం చేశారు. వరుసగా పెరుగుతున్న డీజిల్ ధరల వల్ల సంస్థకు ఏటా రూ.219 కోట్ల అదనపు భారం పడుతోందన్నారు. మరింత మెరుగైన సేవలను అందించడం, రవాణేతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం వంటి చర్యల ద్వారా నష్టాలను అధిగమించేందుకు కృషి చేయాలని ఆయన తెలిపారు. ఎండీగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు పూర్తయిన సందర్భంగా ఆర్టీసీ హౌస్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీజిల్‌పై ఇతర పన్నులతో పాటు అదనంగా సెస్సు వసూలు చేయడం వల్ల ప్రతి లీటరుపై అదనపు భారం పడుతోందన్నారు. తెలంగాణాతో పోలిస్తే రూ.4లు, కర్ణాటకతో పొలిస్తే రూ.7లు అదనంగా చెల్లించాల్సి వస్తోందన్నారు. దీన్ని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గత ఏడాది కోరామని, ఈ ఏడాది కూడా ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. సంస్థ లాభనష్టాలను వివరిస్తూ 2017-18 సంవత్సరంలో సంస్థకు రూ.480 కోట్ల నష్టం వచ్చిందన్నారు. 2016-17 సంవత్సరంతో పోలిస్తే రూ.300 కోట్ల మేర నష్టాన్ని నివారించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంస్థ సొంత స్థలాల్లో వ్యాపార, వాణిజ్య అవసరాల కోసం బీఓటీ, డీఓటీ, పీపీపీ విధానంలో భవనాల నిర్మాణాలకు
టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం కేటాయించిన రూ.200 కోట్లతో 850 కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. వీటిలో 134 రూట్లలో కొత్త సర్వీసులను నడుపుతామని, మిగిలిన వాటిని పాత బస్సుల స్థానంలో వినియోగిస్తామన్నారు. సీజన్, అన్ సీజన్లలో రద్దీకి అనుగుణంగా ఫ్లెక్సీ ఫెయిర్ విధానాన్ని ఆర్టీసీలో అమలుచేయాలని నిర్ణయించామన్నారు. రద్దీ రోజుల్లో టికెట్ చార్జీలు పెంచుతామని, రద్దీ లేని రోజుల్లో చార్జీలు తగ్గిస్తామన్నారు. తద్వారా ఆక్యుపెన్సీ రేటు పెరగగలదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రయాణికులకు వారు ప్రయాణించాలనుకున్న బస్సును గుర్తించేందుకు వీలుగా మొబైల్ యాప్‌ను తీసుకొచ్చామన్నారు. నిర్దేశించిన సమయానికే బస్సు బయలుదేరి గమ్యానికి చేరడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, సంస్థ లాభాల బాటలో పయనించాలంటే సిబ్బంది పనితీరు, వారందించే సహకారంతోనే సాధ్యమవుతోందన్నారు. ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్లు కోరిన రోజున సెలవును మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు. పాలనాపరంగా నెలకొన్న సమస్యలను కూడా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. జూన్‌లో పదవీ విరమణ చేసే ఉద్యోగులకు అదే రోజున అన్ని ప్రయోజనాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. చార్జిషీట్ల ద్వారా సిబ్బంది వేధింపులు ఇకపై ఉండవన్నారు. ఆర్టీసీ ఆస్తుల పెంపకంపై షీలాబేడీ కమిటీ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఏపీ పరంగా 14 ఆస్తుల్లో వాటా కావాలని కోరుతున్నామని, తెలంగాణ అధికారులు కేవలం మూడు ఆస్తులపైనే వాటా ఇస్తామని అభ్యంతరం చెబుతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో కార్గో, కొరియర్ సేవలను విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సురేంద్రబాబు పేర్కొన్నారు. విలేఖరుల సమావేశంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎ.వెంకటేశ్వరరావు, కె.సత్యనారాయణ, ఎం.వెంకటేశ్వరరావు, జి.జయరావు, ఎన్‌వి రావు పాల్గొన్నారు.
కార్మికులకు రూ.30 లక్షల ప్రమాద బీమా
ఏపీఎస్‌ఆర్టీసీలో పనిచేస్తున్న దాదాపు 55వేల మంది ఉద్యోగ, కార్మికులకు 30 లక్షల రూపాయల మేర ప్రమాద బీమా వర్తించేలా ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెడుతూ సంస్థ ఎండీ ఎన్‌వి సురేంద్రబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ బీమా వర్తించాలంటే కార్మికులు, ఉద్యోగులు తాము వేతనం తీసుకునే బ్యాంక్ బ్రాంచికి వెళ్లి తమ ఆధార్ కార్డు, పాన్‌కార్డు, ఓటరు కార్డు గుర్తింపులో ఏదో ఒక దానిని తమ సంతకంతో ఆ బ్యాంక్‌లోనే సమర్పించి వెంటనే బయోమెట్రిక్ ద్వారా అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. ఈ మొత్తం ప్రక్రియ జూన్ 10తేదీలోగా జరగాలి. అప్పటి నుంచి ఈ రూ.30 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది.