రాష్ట్రీయం

రైల్వేజోన్‌పై మళ్లీ ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 26: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ రావడానికి పరిస్థితులు అనుకూలిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎలాగైనా జోన్ ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. రైల్వేకార్మిక సంఘాలు సైతం జోన్ వస్తుందనే అంటున్నాయి. అలాగే ప్రజాప్రతినిధులకు కూడా జోన్ సంకేతాలు అందుతున్నాయి. తెలుగు ప్రాంతాలతో కూడిన రైల్వేజోన్‌తో భవిష్యత్‌లో ఇబ్బందులు లేకుండా చేయాలనేది కేంద్రం ఆలోచనగా తెలిసింది. దీంతో ఒడిశా ఆధిప త్యం నుంచి వాల్తేరు డివిజన్‌ను బయటపెట్టినట్టు అవుతుందని కూడా రైల్వే మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా మరింతగా బలపడేందుకు ఇదో అవకాశంగా కూడా కేంద్రం భావిస్తోంది. భారతీయ రైల్వేకు ఆర్థిక వెనె్నముకగా ఉండే వాల్తేరు డివిజన్‌తో పాటు దక్షిణమధ్య రైల్వే పరిధిలోకి వచ్చే గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలిసింది. ఈస్ట్‌కోస్ట్ రైల్వేజోన్‌లో వాల్తేర్ డివిజన్‌ను తొలగిస్తే ఇక ఉన్నవి ఖుర్దా, సంబల్‌పూర్ డివిజన్లు. ఈ డివిజన్ల పరిధిలో ఎలాగూ తెలుగు ప్రాంతాల్లేవు. ఈ రెండు డివిజన్లతోపాటు కొత్తగా రాయగడ రైల్వే ప్రాంతాన్ని జోన్‌గా ఏర్పా టు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇక దక్షిణ మధ్య రైల్వేజోన్‌తో ఎటువంటి సాంకేతికపరమైన ఇబ్బందులు లేకుండానే ఇప్పటికే అనేకసార్లు నిర్వహించిన చర్చలు ఫలించినట్టు తెలిసింది. ఏపీకి కొత్తజోన్ వస్తున్నందున విశాఖలో కొత్తగా సమకూర్చాలని వౌలిక వసతులు, వనరులు అంటూ ఏమీ లేవు. వీటన్నింటికి రూ.వెయ్యి కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని డివిజన్ వర్గాలు అం చనా వేస్తున్నాయి. కొత్త జోన్ కోసం ప్రత్యేకించి సంవత్సరాల తరబడి శ్రమించాల్సిన పనేలేదని అధికారవర్గాలు, కార్మిక వర్గం స్పష్టం చేస్తున్నాయి.
జోన్‌కు కొత్త పేరు: సంబల్‌పూర్, ఖుర్దా, కొత్తగా రానున్న రాయగడ డివిజన్లతో ఎప్పటిమాదిరిగానే ఈస్ట్‌కోస్ట్‌రైల్వేజోన్ ఉంటుంది. ఇక నాలుగు డివిజన్లతో ఏపీలో విశాఖ కేంద్రంగా తెలుగు ప్రాంతాలను కలుపుతూ ఏర్పడే కొత్త రైల్వేజోన్‌కు పేరు పెట్టాల్సి ఉంది.