రాష్ట్రీయం

సగం రుణం మాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మే 27: హౌసింగ్ ఫర్ ఆల్ (హెచ్‌ఎఎఫ్) పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కలసి నిర్మిస్తున్న అపార్టుమెంట్లలో అర్హులు చెల్లించాల్సిన మిగిలిన భాగం ( 50శాతం షేర్)ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మాఫీ చేస్తానని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర 173వ రోజు ఆదివారం భీమవరం చేరుకుంది. ఉండి నియోజకవర్గంలోని కాళ్ల మండలం జక్కరం గ్రామం నుంచి ఉదయం పాదయాత్రగా బయలుదేరి సాయంత్రానికి భీమవరం పట్టణానికి చేరుకుని అక్కడ నిర్వహించిన సభలో జగన్ ప్రసంగించారు. హౌసింగ్ ఫర్ ఆల్ పథకంలో ఇళ్లకు కేంద్రం, రాష్ట్రం 50 శాతం చెల్లిస్తున్నాయని ఆయన వివరించారు. ఈ ఇళ్ల నిర్మాణం పెద్ద అవినీతి అని ఆయన ఆరోపించారు. ఇక ఆక్వా రంగం కుదేలవుతున్న తరుణంలో
ఈ రంగాన్ని కాపాడుకునేందుకు రైతులు వినియోగించుకుంటున్న విద్యుత్‌ను రూ.1.50 పైసలకే సరఫరా చేస్తామన్నారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నాలుగో ఏడాది రొయ్యకు మద్దతు ధరను ప్రకటిస్తానని ఆక్వా రైతాంగానికి ఆయన హామీ ఇచ్చారు. ఇక ఎన్నికల సమయం దగ్గరపడుతోందని చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు కాబట్టి ఇంటికో మనిషిని పంపించి కిలో బంగారం ఇస్తానని చెప్పడం జరుగుతోందని, అదీ కూడా మీరు నమ్మరు కాబట్టి బంగారానికి బోనస్‌గా బెంజ్ ఇస్తానంటారన్నారు. దానిని కూడా ప్రజలు నమ్మరు కాబట్టి ఓటుకు రూ.3వేలు ఇస్తారని, అది తీసుకోకుండా ఐదేళ్ళను చూపించండి, అంటే రూ.5వేలు తీసుకోండని, అదంతా మన డబ్బే అంటూ అది తీసుకుని మనస్సాక్షికి ఓటు వేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో కోరారు. మహానాడును ఎన్టీఆర్ జయంతి పేరిట నిర్వహిస్తున్నారని, ఎన్టీఆర్ సీఎం కుర్చీ, పార్టీ, ఎన్టీఆర్ ట్రస్ట్, ఇల్లును దోచుకుని వెన్నుపోటుపొడిచారని, ఎన్టీఆర్ మృతికి కారణం చంద్రబాబేనని విమర్శించారు. అటువంటి చంద్రబాబు ఎన్టీఆర్‌కు దండవేస్తుంటే ఏమనాలని అక్కడకు వచ్చిన వారిని ప్రజలను ప్రశ్నించారు. ఏప్రిల్ 4వనెల అని చంద్రబాబు పుట్టిన రోజు అదే మాసంలో 20వ తేదీ అని దాన్ని కలిపితే 420 అవుతోందని, చంద్రబాబుది 420 బుద్దులేనని జగన్ విమర్శించారు. భీమవరంలో జరుగుతున్న అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోందన్నారు. గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్కును మరో ప్రాంతానికి తరలించాలన్నారు. రానున్న రోజుల్లో నాణ్యత కలిగిన రొయ్య సీడు, ఫీడు, ప్రోసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్‌లను తీర ప్రాంతంలో ఏర్పాటుచేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తానని జగన్ హామీ ఇచ్చారు. టీడీపీ వెబ్‌సైట్‌లో కనీసం 2014 ఎన్నికల మ్యాన్‌ఫెస్టో కనిపించటం లేదని, అది చూస్తే ప్రజలు కొడతారని చంద్రబాబుకు తెలుసునన్నారు. ఇదిలా ఉండగా భీమవరంలోకి ప్రజా సంకల్పయ్రాత అడుగిడిన తర్వాత జగన్ చాలా ఉత్సాహంగా కనిపించడం విశేషం. పార్టీలో చేరికలు, జనాన్ని చూసిన జగన్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. భీమవరంలో జగన్ రాక కోసం సుమారు రూ.2 కోట్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విశేషం.

చిత్రం..భీమవరం సభలో మాట్లాడుతున్న వైకాపా అధ్యక్షుడు జగన్