రాష్ట్రీయం

సీఎంకు పీఎం అపాయింట్‌మెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్ల వ్యవస్థలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదం కోసం, మైనారిటీ రిజర్వేషన్లు, హైకోర్టు విభజన వంటి ముఖ్యమైన అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించేందుకు సీఎం కే. చంద్రశేఖర్ రావు ఢిల్లీ వెళ్ళారు. ఆదివారం ప్రగతి భవన్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో జోన్ల వ్యవస్థ, రైతులకు జీవిత బీమా పథకంపై చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించింది. అనంతరం సీఎం కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళారు. ఆయనవెంట పలువురు ఎంపీలు, ముఖ్య నేతలు ఉన్నారు.
రాష్ట్ర హైకోర్టు విభజన అంశం చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. దీంతో పలు పర్యాయాలు న్యాయవాదులు ఆందోళనలకు దిగారు. ఉమ్మడి ఏపీలోని హైకోర్టును విభజించకపోవడంతో ఎదురవుతున్న సమస్యలను ప్రధానికి సీఎం వివరించనున్నారు. ఇంకా మైనారిటీలకు ఇచ్చిన రిజర్వేషన్ల హామీని ఎట్టిపరిస్థితుల్లో అమలు చేయాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. ఎందుకంటే వచ్చే ఏడాదే లోక్‌సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు
కాబట్టి వారికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోతే మైనారిటీ ఓట్లను కోల్పోవాల్సి వస్తుందన్న ఆందోళన తెరాసలో లేకపోలేదు. కాబట్టి ఈ విషయంలో ప్రధానిని ఒప్పించాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. ఇక రాష్ట్రంలో కొత్తగా చేయాలనుకున్న ఏడు జోన్లు, 2 మల్టీ జోన్ల విషయంలోనూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం లభించేలా సహకరించాల్సిందిగా ఆయన ప్రధానిని కోరనున్నారు. వీటన్నింటిని సాధించుకునేందుకు అవసరమైతే నాలుగు రోజులు ఢిల్లీలోనే మకాం వేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.