రాష్ట్రీయం

ఎపికి ఆర్‌డిఎస్‌పై తెలంగాణ అభ్యంతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తుంగభద్ర నదీ యాజమాన్యం బోర్డు సమావేశంలో రాజోలిబండ మళ్లింపు స్కీం (ఆర్‌డిఎస్)ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాలన్న ప్రతిపాదనను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నిర్ణయం వల్ల మహబూబ్‌నగర్ జిల్లాలో 87వేల ఎకరాల ఆయకట్టు ప్రయోజనాలు దెబ్బతింటాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. గురువారం ఇక్కడ తుంగభద్ర బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్ గుప్తా అధ్యక్షత వహించారు. ఈ అంశంపై వచ్చే సమావేశంలో చర్చిస్తామని బోర్డు చైర్మన్ ఇరు రాష్ట్రాలకు సూచించారు. అనంతరం తుంగభద్ర హైలెవెల్, లోలెవల్ కాల్వ పనులను ఆధునీకరణ చేపట్టాలని నిర్ణయించారు. రెండు సీజన్లలో ఆధునీకరణ పనులను పూర్తి చేయాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో బోర్డు కార్యదర్శి రంగారెడ్డి, ఎపి ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, తెలంగాణ చీఫ్ ఇంజనీర్ మురళీధర్‌రావు హాజరయ్యారు.