ఆంధ్రప్రదేశ్‌

రైల్వే బడ్జెట్‌పై భగ్గుమన్న లెఫ్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌పై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. పెండింగ్ ప్రాజెక్టుల భర్తీకి నిధుల కేటాయింపు లేకపోవటం, రాజధాని విజయవాడ, అమరావతి నుంచి కొత్త రైలు మార్గాలు, కొత్త రైళ్ల ప్రస్తావన లేకపోవటం కనీసం విద్యుదీకరణకు ప్రతిపాదన లేకపోవటంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ వద్ద ధర్నా జరగ్గా, సిపిఎం రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ కన్వీనర్ బాబూరావు నాయకత్వంలో రైల్వే బడ్జెట్ దిష్టిబొమ్మ దగ్ధం వంటి నిరసన కార్యక్రమాలు చోటుచేసుకున్నాయి. అయితే విజయవాడ ఎంపి కేశినేని నాని మాత్రం ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలకు ఈ బడ్జెట్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరిగిందన్నారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఐదు ప్లాట్‌ఫారాల్లో ఎస్కలేటర్ సదుపాయం, మంచినీటి సౌకర్యాల మెరుగుదలకు నిధులు కేటాయించటం జరిగిందన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి కంభంపాటి హరిబాబు కృషివలన కాకినాడ-పిఠాపురం రైల్వేలైన్‌కు రూ.50 కోట్లు, కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ కోసం నిధులు కేటాయించారన్నారు. కాగా రాష్ట్రంలో అతిపెద్ద రైల్వే జంక్షన్ విజయవాడలో ఆర్‌ఆర్‌ఐ పనుల వేగవంతంకు నిధుల కేటాయింపుల్లేవు. విజయవాడ-మచిలీపట్నం-నర్సాపురం రైల్వే లైన్ల జంబ్లింగ్ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. విజయవాడ-గుడివాడ-్భమవరం-నిడదవోలు రైలు మార్గం డబ్లింగ్‌కు ప్రతిపాదనలు లేవు. ముఖ్యంగా విశాఖ రైల్వే డివిజన్‌కు ప్రకటన లేకపోవటం ఆంధ్రులను నిరాశపరచింది.

విజయవాడ రైల్వే స్టేషన్ ఎదుట బడ్జెట్ దిష్టిబొమ్మ దగ్ధం