ఆంధ్రప్రదేశ్‌

విశాఖ జోన్ ఊసే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రైల్వే బడ్జెట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్‌కు నిరాశే ఎదురైంది. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు గురువారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఏ కీలక ప్రాజెక్టు గురించీ ప్రస్తావన లేకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ఎంపిలు బడ్జెట్ తీరుపై పెదవి విరిచారు. ప్రధానంగా అవశేష రాష్ట్రం కావడంతో కొత్త రైళ్లకు అవకాశం కల్పిస్తారని అంతా ఆశించారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖ రైల్వే జోన్‌కు మోక్షం లభిస్తుందని అనుకున్నారు. అలాగే నూతన రాజధాని అమరావతిని అనుసంధానం చేస్తూ కొత్త రైల్వే లైన్లకు కూడా కేంద్రం ఆమోద ముద్ర వేస్తుందని భావించినా నిరాశే ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వే శాఖకు చెందిన మాజీ జోనల్ మేనేజర్ శ్రీవాస్తవను సలహాదారుగా నియమించి, అనేక ప్రతిపాదనలతో ముందుగానే కేంద్రానికి పంపించడంతో పాటు ప్రధానిని , రైల్వే మంత్రిని స్వయంగా సిఎం కలిసి విజ్ఞప్తి చేశారు. కోటిపల్లి-నర్సాపురం లైన్‌కు 200 కోట్లు, పిఠాపురం-కాకినాడ లైనుకు 50 కోట్లుసహా మరికొన్ని లైన్లకు అరకొర నిధులు కేటాయించి కేంద్రం చేతులు దులుపుకుంది. నడికుడి -బీబీనగర్ రైల్వే లైన్ విస్తరించాలని కూడా సిఎం ఇటీవల ప్రధానిని కోరారు. ప్రధానంగా రాయలసీమ వాసులు రాజధాని అమరావతిని చేరుకునేందుకు వీలుగా రైల్వే కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని అనేక ప్రణాళికలు వేసినా, ప్రయోజనం లేకపోయింది.
విశాఖవాసుల నిరాశ
విశాఖపట్నం: బడ్జెట్‌లో విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ను ప్రకటిస్తారని అంతా ఆశించారు. బడ్జెట్‌కు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉత్తరాంధ్ర మంత్రు లు విశాఖకు రైల్వే జోన్ వస్తుందని ప్రకటించారు. స్వయంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పలు సందర్భాల్లో విశాఖకు రైల్వే జోన్ ఖాయమనే సంకేతాలు ఇచ్చారు. రైల్వేజోన్ కోసం సంవత్సరం అంతా ఎటువంటి ఆందోళనలు, లేదా కసరత్తులు జరపని రైల్వే జోన్ సాధన సమితి బడ్జెట్ ప్రకటించిన తరువాత పెదవి విప్పి, రైల్వే మంత్రిపై విమర్శలు చేయడం గమనార్హం. విశాఖ నగరం నుంచి విజయవాడకు వెళ్లడానికి రద్దీకి తగినట్టుగా రైళ్లు లేవు. పారిశ్రామిక, పర్యాటక నగరంగా ఎదిగిన విశాఖ నుంచి రాష్ట్ర రాజధానికి రద్దీ పెరిగినా అదనంగా రైళ్లను ప్రవేశపెట్టకపోవడం ఈ ప్రాంత ప్రయాణికులను నిరాశపరచింది. అలాగే రెండు పోర్టు సిటీలైన గోవా-విశాఖ మధ్య రైలు నడపాలని విశాఖ ఎంపి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు కోరారు. మంత్రి సురేష్ ప్రభు దీనిపై కూడా స్పందించలేదు. అలాగే విశాఖ నుంచి బెంగళూరు, చెన్నై, తిరుపతి, షిర్డీకి కూడా తగినన్ని రైళ్లు లేవు. ఈ మార్గాల్లో అదనంగా రైళ్లను ప్రవేశపెట్టాలని ఉత్తరాంధ్రకు చెందిన ఎంపిలు చేసిన డిమాండ్‌ను కూడా రైల్వే మంత్రి పట్టించుకోలేదు. హౌరా నుంచి విజయవాడ వైపునకు వెళ్లే రైళ్లు విశాఖ రాకుండా దువ్వాడ మీదుగా మళ్లిపోతున్నాయి. దీనివలన విశాఖ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం ఈ బడ్జెట్‌లోనైనా ఆ రైళ్లను వాల్తేరు స్టేషన్‌కు తీసుకువచ్చే విషయమై ఎటువంటి ప్రకటన లేదు. గత రైల్వే బడ్జెట్‌లో విశాఖకు వ్యాగన్ వర్క్‌షాప్ కేటాయించారు. సుమారు 150 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఈ బడ్జెట్‌లో కేవలం 30 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి వాల్తేరు డివిజన్‌కు 1,088 కోట్ల రూపాయలతో 28 పనులు కేటాయించడమొక్కటే కాస్త ఊరట కలిగించే అంశం.