తెలంగాణ

దళిత యువతిపై సామూహిక అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్/ హైదరాబాద్: కరీంనగర్ జిల్లా వీణవంకలో చోటుచేసుకున్న దళిత యువతిపై అత్యాచార ఘటన రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేపుతోంది. అత్యాచారానికి పాల్పడి, ఆ దారుణాన్ని వీడియోలో చిత్రించి వేధిస్తున్న ముగ్గురు కామాంధుల వ్యవహారంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అన్నయ్యా అని పిలుస్తూ వదిలిపెట్టమని కాళ్లావేళ్లా పడిన దారుణంగా ప్రవర్తించిన నిందితులను వదిలిపెట్ట కూడదంటూ రాజకీయ, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలావుంటే, సంఘటన వివరాలు తెలుసుకున్న మంత్రి ఈటల తీవ్రంగా స్పందించారు. దళిత యువతి సామూహిక అత్యాచార ఘటనపై విచారణకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరోచోట ఇలాంటి సంఘటన తలెత్తకుండా నిందితులపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశాలిచ్చారు. తమకు ఇబ్బంది కలిగే సంఘటనలపై మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేసే పరిస్థితులు పోలీసులు కల్పించాలని, ఈ విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఇదిలావుంటే, హుజూరాబాద్ డిఎస్పీ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ వరంగల్ డిఐజి మల్లారెడ్డి ఆదేశించారు. ఘటనలో ఇప్పటికే నిందితుడు ఒకరిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి ఉంది. జిల్లాలో సంచలనం సృష్టిస్తున్న ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వీణవంక మండలం చల్లూరుకు చెందిన 23ఏళ్ల యువతిని శంకరపట్నం మండలం ఆముదాలపల్లి గ్రామానికి చెందిన గొట్టె శ్రీనివాస్ (26), కల్వల గ్రామానికి చెందిన ముద్దం రాకేష్ (19), ముద్దం అంజి (24) అనే ముగ్గురు కలిసి ఈనెల 10న శంకరపట్నం మండలం కాచాపూర్‌లోని గుట్టలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో రాకేష్ అనే యువకుడు ఈ దారుణాన్ని వీడియోగా చిత్రీకరించాడు. వదిలిపెట్టండన్నయ్యా అంటూ యువతి బతిమిలాడినా వదలకపోగా, వీడియో చిత్రాన్ని యూట్యూబ్‌లో పెడతానంటూ పది రోజులుగా బెదిరిస్తుండటంతో బాధిత యువతికి ఏంచేయాలో అర్థంకాక తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వివరించింది. తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు ఈనెల 24న ముగ్గురినీ గ్రామంలోకి పిలిపించుకుని సాయంత్రం నుంచి రాత్రిదాకా తీవ్రంగా చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు చల్లూరు గ్రామానికి చేరుకుని గ్రామస్తుల దాడిలో గాయపడిన శ్రీనివాస్, రాకేష్, అంజిలను వరంగల్‌లోని ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. ఆగ్రహావేశాలు చల్లారని గ్రామస్థులు తాజాగా శనివారం సైతం నిందితులపై దాడికి పాల్పడినట్టు తెలిసింది. ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుల వద్దకు పేషెంట్లను చూడ్డానికి వచ్చినట్టుగా వచ్చిన గ్రామస్థులు వారిపై దాడి చేసినట్టు తెలుస్తోంది. ఘటనపై బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీణవంక పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన సంచనలం రేపుతుండగా, వరంగల్ డిఐజి మల్లారెడ్డి స్థానిక పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ హుజురాబాద్ డిఎస్పీని ఆదేశించారు. ఈమేరకు డిఎస్పీ రవీందర్‌రెడ్డి శుక్రవారం విచారణ జరిపారు. విచారణను వేగవంతం చేశామని, రాకేష్ అనే నిందితుడిని శనివారం అరెస్ట్ చేశామని, మరో ఇద్దరిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జికాగానే అరెస్ట్ చేయనున్నట్టు డిఎస్పీ రవీందర్‌రెడ్డి తెలిపారు. సంఘటనపై దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. దీంతో ఘటన రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేపుతోంది.

చిత్రం... యువతిపై అత్యాచారానికి పాల్పడిన యువకులు