ఆంధ్రప్రదేశ్‌

2018 నాటికి పోలవరం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. 2018 చివరి నాటికి పోలవరం నిర్మాణం పూర్తికానుందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా, జర్మనీ దేశాల నుంచి పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణ యంత్రాలను దిగుమతి చేసుకోగా ఆదివారం ఆయన నెల్లూరులో పూజలు నిర్వహించి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును ఎలాగైనా పూర్తిచేయాలనే ముఖ్యమంత్రి సంకల్పానికి దిగుమతైన ఈ భారీ యంత్రాలే నిదర్శనమన్నారు. 50 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేందుకు వీలుగా దాదాపు 330 అడుగుల లోతులో ఈ యంత్రాల ద్వారా డయాఫ్రాం వాల్ నిర్మాణం చేపడతామని వెల్లడించారు. ఏడాదిలోగా పోలవరం కుడి, ఎడమ కాలువల నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ప్రస్తుతం గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం పూర్తయిందని, త్వరలో గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానాన్ని చూడబోతున్నారని పేర్కొన్నారు. తెలుగుగంగకు సైతం అన్ని అటవీ అనుమతులు లభించినట్లు స్పష్టం చేశారు. ఆంధ్రుల గుండె చప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వృథాగా సముద్రంలో కలుస్తున్న 1600 టిఎంసిల నీటిని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. అదేవిధంగా హంద్రీ-నీవా రెండో దశ ఈ ఏడాది జూలై నాటికి, గాలేరు-నగరి 1వ దశ వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తిచేస్తామన్నారు. వీటివల్ల అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాలకు సాగు, తాగునీటి సమస్య పూర్తిగా తీరనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టిసీమలో మార్చి నెలాఖరుకు మరో 20 మోటార్లు అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. అనంతరం చెన్నై నుంచి భారీ యంత్రాలతో నెల్లూరు వచ్చిన వాహనాలకు ఆయన పచ్చజెండా ఊపి రాష్ట్రంలోకి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర, వాకాటి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, స్థానిక టిడిపి నేతలు పాల్గొన్నారు.
chitram...
చెన్నై నుండి వచ్చిన పోలవరం ప్రాజెక్టు యంత్ర సామగ్రికి నెల్లూరులో స్వాగతం పలికి పూజలు నిర్వహించిన మంత్రి దేవినేని ఉమా తదితరులు