తెలంగాణ

దుర్గమ్మ ముంగిట్లో కనుమరుగైన గంగమ్మ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి: ఏడుపాయలుగా చీలిన గంగమ్మ ఒడిలో వెలసిన దుర్గమ్మ దివ్య క్షేత్రానికి తరలివచ్చే భక్తులకు ఈ సారి నీటి కష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. 600 సంవత్సరాల అమ్మవారి ఆలయ చరిత్రలో ఎన్న డు కూడా ఇంతటి కిష్ట పరిస్థితులను భక్తులు ఎదుర్కొని ఉండకపోవచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతియేటా గలగల మంటూ పారే మెద క్ జిల్లా ఏడుపాయల నీటి చప్పుళ్లను వింటూ పరవశిస్తూ అమ్మవారిని దర్శించకునే భక్తులకు ఈ సారి అలాంటి చప్పుడు వినకుండానే దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు సంవత్సరాలుగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులతో మంజీర నదిపై ఉన్న ప్రాజెక్టులన్ని ఎండిపోవడంతో ఈ సారి మహాశివ రాత్రి జాతరకు తరలివచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం ఖాయమని చెప్పవచ్చు. కేంద్ర మాజీ మంత్రి దివంగత నేత ఆలె నరేంద్ర పుణ్యమా అని తాగునీటి కటకట తలెత్తకుండా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు వనంలోకి వచ్చే జనం కోసం నల్లాలను ఏర్పాట్లు చేస్తున్నారు. ఘన్‌పూర్ ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోవడంతో ఇన్ని ఇబ్బందులు నెలకొన్నాయి. ప్రాజెక్టుకు ఎగువన ఉన్న మడుగుల్లోని నీటిని మోటార్ల ద్వారా దిగువన ఉన్న చెక్ డ్యాంలోకి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మహా శివరాత్రి పర్వదినం అంటే సాధారణంగా శివాలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతాయి. కానీ అందుకు భిన్నంగా తెలంగాణాకే తలమానికంగా శతాబ్దాల కాలం గా మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్‌సాన్‌పల్లి అటవి ప్రాంతంలో వెలసిన వన దుర్గా భవాని ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగడం విశేషం. సింగూ ర్ ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి ఇప్ప టి వరకు ఎన్నడు కూడా ఇంతటి దయనీయ పరిస్థితి తలెత్తకపోగా కనీసం ఉన్న నీటినైనా దిగువకు విడుదల చేసే అవకాశం ఆవగింజంత కూడా లేదు. శివరాత్రికి ఒకటి రెండు రోజుల ముందు నుంచి ఎగువన నీటిని మోటార్ల ద్వారా తరలించి చెక్ డ్యాం నీటిని దిగువకు వదిలిపెట్టడంతో పాటు అంటు వ్యాధు లు ప్రబలకుండా ఉండేందుకు బ్లీచింగ్ పౌడర్‌ను చల్లడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడుపాయల్లో విపత్కరమైన నీటి ఇబ్బందుల దృష్ట్యా ఈ సారి భక్తులు స్థిరంగా ఉండకుండా దర్శించుకుని వెళ్లిపోయే వారు ఎక్కువ మంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

టిఆర్‌ఎస్‌ను గెలిపిస్తేనే
అభివృద్ధి సాధ్యం
ఎన్నికల ప్రచారంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 28: రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయాలనే తలంపుతో పాలన సాగిస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అదివారం మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కృష్ణారావు మాట్లాడుతూ టిఆర్‌ఎస్ వల్లనే అభివృద్ధి సాద్యమవుతుందని అన్నారు. ప్రజలు ప్రత్యే క తెలంగాణ రాష్ట్ర సాధనలో నిర్విరామంగా కృషి చేసి అనేక అటుపోట్లను ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించడమే కాక ఎన్నికల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అభివృధ్ధే ద్యేయంగా పని చేస్తున్న టిఆర్‌ఎస్‌కి ప్రస్తుతం జరుగుతున్న నగర పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయ న పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమ్రంత్రి కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసే గ్రేటర్ హైదరాబా ద్ ఎన్నికల్లో, నారాయణఖేడ్, వరంగల్ ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ఆయా ప్రాంతాలలోని ఓటర్లు భారీ మెజారిటీతో గెలిపించారని అన్నారు. అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో కూడా జిహెచ్‌ఎంసి ఎన్నికల ఫలితాలు పునరావృతం కావాలని మంత్రి జూపల్లి ఆకాంక్షించారు.
ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి ప్రతిపక్ష పార్టీలను నామరూపాలు లేకుండా చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌తో మాట్లాడి అచ్చంపేట అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేయిస్తానని ఆయన హమీ ఇచ్చారు. అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో ఒకవేళ టిఆర్‌ఎస్ అభ్యర్థులు ఓడిపోతే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమి లేదని తమ మంత్రి పదవులకు కూడా ఎలాంటి ఢోకా ఉండదని, అందువల్ల జరిగే పరిణామం మాత్రం అచ్చంపేట అభివృద్ధి కుంటుపడడమే అన్ని అన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు చెప్పే కల్లబొల్లి కబుర్లను నగర పంచాయతీ ఓటర్లు నమ్మకూడదని అన్నారు. ఎన్నికల్లో అచ్చంపేట ఓటర్ల తీర్పు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గర్వించేలా ఉండాలని టిఆర్‌ఎస్ దెబ్బకు ప్రతిపక్షాలు కనుమరుగు కావాలని కోరారు. అచ్చంపేట అభివృద్ధి కుంటుపడకుండా ఉండాలంటే నగరపంచాయతీలోని ఓటర్లు టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్, జడ్పిటిసి రామకృష్ణారెడ్డి, ఎంపిపి పర్వతాలు, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మనోహర్ తదితరులు పాల్గొన్నారు.