తెలంగాణ

చిన్నారిపై అత్యాచారం, హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవ్‌పూర్: కరీంనగర్ జిల్లా కాటారం మండలం, దామెరకుంటలో మూడున్నరేళ్ల వయసుగల చిన్నారిపై అదేగ్రామానికి చెం దిన ఓ సైకో అత్యాచారం చేసి, హత్య చేశాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ సంఘటనకు సంబంధించి కాటారం సిఐ సదన్‌కుమార్ , ఎస్‌ఐ పర్శ రమేష్ ఆదివారం విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శనివారం దామెరకుంటలో తొగరి రాజస్వామి, త్రివేణి కుమార్తె (మూడున్నరే ళ్లు) ఇంట్లో ఉండగా అదే గ్రామానికి చెందిన జక్కుల వెంకటస్వామి (30) చిన్నారిపై అత్యాచారం చేసాడు. చిన్నారి అత్యాచారం అనంతరం గొంతునులిమి వెంకటస్వామి చంపేశాడు. మృతదేహాన్ని వెంకటస్వామి తన ఇంట్లో గంప కింద భద్రపరిచాడు. ఇదిలాఉండగా పొలం పనులకు వెళ్లి ఇంటికి వచ్చిన చిన్నారి తల్లి త్రివేణి తమ పాప కోసం ఆరా తీయగా ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన చెందింది. పాప కనబడడం లేదనే విషయాన్ని చిన్నారి తండ్రి రాజస్వామికి వివరించింది. రాజస్వామి కాటారం పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న రాజస్వామి ఇంటికి వచ్చి పాప ఆచూకీ కోసం ఆరా తీశాడు. కాటారం సిఐ సదన్‌కుమార్, ఎస్‌ఐ రమేష్ సంఘటన స్థలం వద్దకు చేరుకుని పరిసరాలను పరిశీలించారు.
ఈ నేపథ్యంలో జక్కు ల వెంకటస్వామి అనే సైకో ఇంట్లో గంప కింద పాప మృతదేహాన్ని కనుగొన్నారు. ఇదిలావుండగా, నిందితుడు జక్కుల వెంకటస్వామి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. జులాయిగా తిరుగుతూ మహిళలను వేధిస్తున్న వెంకటస్వామిని పట్టిస్తే 5 వేల రూపాయల నగదు బహుమతిగా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. చిన్నారి మృతదేహానికి గోదావరిఖని ప్రాంతీయ ఆసుపత్రిలో మహిళా డాక్టర్లతో పోస్ట్‌మార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

లఘుచిత్రంలో
కెసిఆర్ మనవడు

హైదరాబాద్, ఫిబ్రవరి 28: ముఖ్యమంత్రి కెసిఆర్ మనవడు, కెటిఆర్ కుమారుడు హిమాంశు రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను ప్రసాద్ ల్యాబ్‌లో ఆదివారం ప్రదర్శించారు. సామాజిక సమస్యలపై పిల్లలను చైతన్య పరచడం, సమస్యలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో తెలియజేసే ఉద్దేశంతో ‘సూపర్ హార్ట్స్’ పేరుతో షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. అవినీతి, మద్యపానం, ధూమపానంవంటి వ్యసనాలకు దూరంగా ఉండటం అత్యంత ఆవశ్యకమని తెలియజేయడం ఈ షార్ట్ఫిల్మ్‌లోని కథాంశం. కెసిఆర్ కుటుంబ సభ్యులు షార్ట్ ఫిల్మ్‌ను తిలకించారు.