రాష్ట్రీయం

ప్రైవేటు కాలేజీల పట్ల వివక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: ప్రవేశాల విషయంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలల పట్ల ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరిస్తోందని, ప్రైవేటు డిగ్రీ కాలేజీల సంఘం అధ్యక్షుడు జి రమణా రెడ్డి, ప్రధాన కార్యదర్శి విజయభాస్కరరెడ్డి ఆరోపించారు.. ప్రభుత్వ వైఖరిని దుయ్యబడుతూ నాంపల్లిలోని కాలేజీయేట్ కమిషనరేట్ కార్యాలయంలో యాజమాన్యాల ప్రతినిధులు ధర్నా చేశారు. సిబ్బందిని అడ్డుకొని, బైఠాయిచారు. కమిషనర్‌ను అడ్డుకుంటామని వారు నినాదాలు చేశారు. దోస్త్ పేరిట నిర్వహిస్తున్న ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ యాజమాన్యాల పాలిట దుష్మన్‌గా మారిందన్నారు. దోస్త్ అడ్మిషన్లలో రోస్టర్ విధానం సవ్యంగా పాటించలేదని, ప్రభుత్వ కాలేజీల్లో ఇష్టారాజ్యంగా సీట్లను పెంచారని, వాటికి ఒక పద్ధతి లేకుండా అడ్మిషన్లు చేశారని వారు ఆరోపించారు. తొలి దశలో సీట్లు పొందిన వారికి స్లయిడింగ్ అవకాశం లేకుండా చేశారని, ఇది విద్యార్థి హక్కులను భంగం కలిగించడమేనని వారు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు 400 రూపాయిలు, స్లయిడింగ్ ఫీజు వెయ్యి రూపాయిల పెంపు గురించి ఎలాంటి సమాచారం లేదని, అలాగే మిగిలిన అంశాలకు సంబంధించి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన ధర్నా దాదాపు ఐదు గంటలకు పైగా కొనసాగింది. అనంతరం వారు కమిషనర్ సిబ్బందికి ఒక వినతి పత్రాన్ని అందించారు.
14 వరకూ గడువు పొడిగింపు
కాగా దోస్త్ గడువును జూన్ 14 వరకూ పొడిగించినట్టు అడ్మిషన్స్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మరో ప్రకటనలో వెల్లడించారు. ఇంత వరకూ 1,78,762 మంది రిజిస్టర్ చేసుకున్నారని, రెండో దశలో 34,375 మంది రిజిస్టర్ చేసుకున్నారని చెప్పారు. వీరిలో 75,718 మంది తమ అడ్మిషన్లను ఖరారు చేసుకున్నారని, స్లయిడింగ్‌కు 11,212 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన వివరించారు.