రాష్ట్రీయం

సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: శ్రీవారి దర్శనానికి భక్తులకు టైమ్‌స్లాట్ విధానం ద్వారా సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను త్వరలో పెంచుతామని తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు చెప్పారు తిరుమలలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తిరుమల, తిరుపతిలో కలిపి మంగళ, బుధ, గురువారాల్లో 17వేల టోకెన్లు, సోమ, శుక్రవారాల్లో 20వేల టోకెన్లు, శని, ఆదివారాల్లో 30వేల టోకెన్లు జారీ చేస్తున్నట్లు తెలిపారు. క్రమేపీ టోకెన్ల సంఖ్యను పెంచుతామన్నారు. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర మ్యూజియంను ఎక్కువ మంది భక్తులు సందర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు వారి దర్శనం సమయం వచ్చేవరకు తిరుమలలోని దర్శనీయ ప్రాంతాలను సందర్శించేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. కాగా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టులో ఒక రోజు విరాళం పథకం ప్రవేశపెట్టినట్టు ఆయన వివరించారు. ఒక రోజు ఖర్చు 26లక్షలు రూపాయలు దాతలు అందిస్తే ఆ సొమ్ముతో దాతల పేరిట ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భక్తులకు భోజనం వితరణ చేస్తామన్నారు. అలాగే ఉదయం అల్పాహారానికి రూ. 6లక్షలు, మధ్యాహ్నం భోజనానికి రూ. 10లక్షలు, రాత్రి భోజనానికి రూ. 10లక్షలు విడివిడిగా కూడా దాతలు అందించవచ్చని చెప్పారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో దాతలకు ఒక రోజు సేవ చేసే అవకాశం కల్పిస్తామని, వారి పేర్లను ప్రదర్శిస్తామన్నారు. తిరుమలలో ఏనుగులు సంచరించకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నామన్నారు. కందకాలు, ఫెన్సింగ్‌కు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఏనుగుల సంచారం విషయంలో భక్తులు ఆందోళనకు గురి కావద్దని ఆయన కోరారు.