తెలంగాణ

మహా పూర్ణాహుతితో ముగిసిన క్రతువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్: లోక కల్యాణార్థం మెదక్ జిల్లా వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రం వద్ద నిర్వహించిన చతుర్వేద స్వాహాకార శ్రీమాతా కోటి గాయత్రీ జపయజ్ఞం ఆదివారం జరిగిన మహా పూర్ణాహుతితో ముగిసింది. పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్దండ విద్యా శంకర భారతీ తీర్థ, రాంపూర్ పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతీ తీర్థ మహా స్వాముల కనుసన్నల్లో ఈ మహాయాగం ఐదు రోజులపాటు జరుగగా 14 కుండాల వద్ద 96 మంది రుత్వికుల గాయ త్రి స్వాహాకారాలతో యాగం సంపూర్ణమయింది. నిరాటంకంగా నిఠ్వహించిన మహత్తర కార్యక్రమ విజయవంతానికి శ్రీ విద్యాధరి క్షేత్ర వ్యవస్థాపక చైర్మన్ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి శ్రమించగా, విశేష అలంకరణలో ఉన్న శ్రీ విద్యాధరి అమ్మవారు, మహా క్రతువును భక్తులు వీక్షించి తరించారు. ఐదు రోజులపాటు జరిగిన సాహిత్య, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లివిరియగా, వేలాది సంఖ్యలో తరలివచ్చిన భక్త జనంతో శ్రీ విద్యా సరస్వతి క్షేత్రంతో పాటు శ్రీ శనైశ్చర, శ్రీ లక్ష్మీగణపతి, శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కాగా గాయిత్రి హోమం, చ తుర్వేద స్వా హాకారాలు, శాంతి స్థాపిత హోమం, బలి ప్రదానం, మహా పూర్ణాహుతి, శ్రీ విద్యా సరస్వతి అమ్మవారికి అవబృద ప్రమాజర్జనము, పండిత సన్మానము, లలితా సహస్ర నామ పారాయణము, విష్ణు సహస్ర నామ పారాయణము నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో శ్రీ సంతాన మల్లికార్జున క్షేత్ర వ్యవస్థాపకులు డాక్టర్ చెప్పెల హరినాథ శర్మ, నిర్వాహకులు దివాకర్ రావు, కిషన్ శర్మ, గోపాలకృష్ణ శర్మ, నాగేందర్‌రావు, రాజేశ్వర్‌రావు, మురళీధర్‌శర్మ, సనాతన శర్మ, విశే్వశ్వర్‌రావు పాల్గొనగా అచ్చలాపురం వేద పాఠశాల పండితులు దుద్దిల్ల మనోహర శర్మ అవదాని వైదిక నిర్వహణలో జరిగింది.