రాష్ట్రీయం

రండి.. చేయి కలపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 13: అమరావతి నగర నిర్మాణంలో మరో ప్రధాన ఘట్టానికి ముందడుగు పడింది. రాజధాని నిర్మాణంలో ముఖ్యమైన ప్రైవేట్ హౌసింగ్, ఆఫీసు స్పేస్, ఇతర నిర్మాణాల్లో రియల్ ఎస్టేట్ డెవలపర్లు ముందుకొచ్చేలా ప్రభుత్వ విధానాన్ని రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ అంశంపై దేశంలో పేరున్న రియల్ ఎస్టేట్ సంస్థల సూచనలు తీసుకుని మార్గదర్శకాలు తయారుచేయాలని, వాటిని మంత్రిమండలిలో చర్చించి ప్రభుత్వ విధానం ప్రకటిద్దామని చెప్పారు. అగ్రశ్రేణి రియల్ ఎస్టేట్ సంస్థలతో బుధవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అమరావతి నిర్మాణంలో తన ఆలోచనలను వారితో ముఖ్యమంత్రి పంచుకున్నారు. మహీంద్ర, షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ, డీఎల్‌ఎఫ్, జీవీకే తదితర సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అమరావతిని గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మిస్తున్నామని, ఈ భావి నగరాన్ని అత్యున్నత సాంకేతికతను మేళవించి అత్యంత ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా డెవలపర్లకు వివరించారు. రాజధానిని
నిర్మించుకోవడం సంక్షోభంలో వచ్చిన సదవకాశంగా చెప్పారు. కొత్తగా నిర్మించిన దేశంలోని కొన్ని రాష్ట్ర రాజధానులను పరిశీలిస్తే, చండీగఢ్ పరిపాలన నగరంగానే ఉండిపోయిందని, నయా రాయపూర్, గాంధీనగర్ జన సామాన్యానికి దూరంగా నిర్మాణమయ్యాయని చెప్పారు. ఢిల్లీ, ముంబై నగరాలు నివాసయోగ్యంగా లేక అంతకంతకూ విస్తరిస్తున్నాయన్నారు. అమరావతి నిర్మించాలని అనుకున్నప్పుడు ప్రపంచంలో పలు అత్యుత్తమ నగరాలపై అధ్యయనం చేశామని, అక్కడున్న ఇబ్బందులను కూడా పరిశీలించి లోపరహిత, అందరికీ నివాసయోగ్యమైన ప్రజా రాజధానిని నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు. సింగపూర్, ఆమ్‌స్టార్‌డ్యామ్ వంటి నగరాలకు లేని పరిశుద్ధమైన చక్కటి జలవనరులు అమరావతికి సొంతమని తెలిపారు. 2 వేల ఎకరాల మేర ద్వీపాలు కృష్ణానదిలో అమరావతికి ఆనుకుని ఉన్నాయని, రెండు రిజర్వాయర్లు కొత్తగా నిర్మిస్తున్నామని, సీఆర్డీఏ పరిధిలో ఉన్న చెరువులన్నీ నీటితో కళకళలాడేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. భూగర్భ కేబుల్ వ్యవస్థ ఈ నగరానికున్న ప్రత్యేకత అని తెలిపారు. మూడు కాల్వలతో విస్తరించిన విజయవాడ నగరం అమరావతికి జంట నగరమని, ఇదే కాకుండా సమీపంలోనే ఉన్న గుంటూరు నగరాన్ని కలుపుకుని రానున్న కాలంలో ఇది మహానగరంగా అవతరించనున్నదని అభిప్రాయపడ్డారు. తొలుత దేశంలో ఉన్న తొలి 10 రియల్ ఎస్టేట్ దిగ్గజాలు వెంటనే ఇక్కడికి వచ్చి తమ నిర్మాణాలను చేపట్టాలన్నదే తన అభిలాష అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘రండి, ఒక్కొక్కరూ కనీసం ఒక్కొక్క నిర్మాణాన్ని చేపట్టండి, ఐకానిక్ నిర్మాణాలతో మీ సంస్థల ప్రతిష్ఠను పెంచడమే కాకుండా అమరావతికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకురండి’ అని ముఖ్యమంత్రి అన్నారు. అమరావతిని నాలెడ్జ్ ఎకానమీ సిటీగా, విశాఖను ఐటీ, హెల్త్ సిటీగా, తిరుపతిని ఎలక్ట్రానిక్, హార్డ్‌వేర్‌సిటీగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఫిన్‌ల్యాండ్, నార్వే దేశాలను రోల్ మోడల్‌గా తీసుకుని రాష్ట్రాన్ని సంతోష రాష్ట్రంగా మార్చడానికి కృషి చేస్తున్నామన్నారు. నదీతీరంలో గృహ సముదాయాలను నిర్మించడం ద్వారా ప్రపంచాన్ని ఆకర్షించవచ్చునని ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ చేసిన సూచనపై మాట్లాడుతూ పర్యావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. పర్యావరణం పేరుతో కొంతమంది అభివృద్ధిని అడ్డుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని, కాలుష్యాన్ని నియంత్రించడానికి మాత్రం వారు ముందుకు రారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
అమరావతిలో ఐటీ కంపెనీలకు ఐదేళ్లు ఉచితంగా ఆఫీసు స్పేస్ అందిస్తే ఎన్నో సంస్థలు ముందుకు రావడమే కాకుండా పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుందని సమావేశంలో రియల్ ఎస్టేట్ ప్రతినిధి ఒకరు చేసిన సూచనను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు.