రాష్ట్రీయం

రహదారి రక్తసిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోగాపురం, జూన్ 13: కాశీ యాత్ర ముగించుకొని మరికొద్ది గంటల్లో ఇంటికి చేరుకోవాల్సి ఉండగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడగా, మరో 30 మంది గాయాలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో పోలిపల్లి సమీపంలో లారీ యూ టర్న్ తీసుకుంటుండగా, విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వేగంగా వస్తున్న ఒక లారీ ఢీకొంది. అదే సమయంలో పూసపాటిరేగ నుంచి విశాఖ వైపు వస్తున్న యాత్రికుల బస్సును రెండు లారీలూ ఢీకొట్టడంతో బస్సు నుజ్జునుజ్జయ్యింది. ఈ సంఘటనలో విశాఖ జిల్లా యలమంచిలి మండలం కృష్ణాపురానికి
చెందిన కొలగాన అప్పలనర్సి (60), కరణం వెంకన్న (45), బీశెట్టి అచ్చియమ్మ (50) మృత్యువాతపడ్డారు. బస్సు బోల్తాపడటంతో భక్తులు అందులో ఇరుక్కుపోయి సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. దీంతో స్ధానికులు అక్కడకు పరుగుపరుగున వచ్చి ప్రయాణికులను బయటకు తీశారు. అలాగే లారీ కేబిన్‌లో చిక్కుకున్న లారీ డ్రైవర్లను బయటకు లాగారు. విశాఖ జిల్లా ఎస్.రాయవరం, యలమంచిలి, నర్సీపట్నం మండలం కోడూరు గ్రామాలకు చెందిన సుమారు 46 మంది భక్తులు కాశీ నుంచి తిరుగు ప్రయాణంలో వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో క్షతగాత్రులు 9 మందిని కెజిహెచ్‌కు, మరో 27 మందిని తగరపువలసలోని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి, 7గురిని విజయనగరంలోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
క్షతగాత్రులు వీరే..
విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం కవులవాడకు చెందిన మల్లవరపు ప్రసాద్, ఎస్.రాయవరం మండలం చిన్న గుమ్ములూరుకు చెందిన కర్రి జోగునాయుడు, యలమంచిలి మండలం పద్మరాజుపేట గ్రామానికి చెందిన యు.రాములమ్మ, యలమంచిలికి చెందిన బొడ్డు పెంటయ్య, ఎస్ రాయవరం మండలం లింగరాజుపాలెంనకు చెందిన ఇ.తిరుమల, ఇ.అప్పావు, దేవ సత్యవతి, జి.కోడూరు గ్రామానికి చెందిన పి.నితీష్, బి.వి.పార్వతీ, అడారి కన్నారావు, భీశెట్టి లక్ష్మి, కరణం చంద్రసత్యవతి, వి.రాములమ్మ, వై.వరలక్ష్లి, కరణం రమణ, కొట్యాడ మహేష్, విజయనగరం జిల్లా ఎల్‌కోట మండలానికి చెందిన ఎద్దు అప్పన్న, యలమంచిలికి చెందిన కరణం చంటి, కె.అప్పలనర్సయ్య, కొలగాన అప్పారావు, బీశెట్టి అప్పారావు, బైరెడ్డి నూకపాప, దొడ్డి రమణమ్మ, భీశెట్టి గౌరమ్మ ఉన్నారు.
ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే ఎస్పీ పాలరాజు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అతనితోపాటు సీఐ రఘువీర్ విష్ణు, తహశీల్దార్, ఆర్డీవోలు సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు కూడా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.